TCS Work From Office: ఆఫీస్‌కి రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ్ - ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్
TCS Work From Office: ఆఫీస్‌కి రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు టీసీఎస్ వార్నింగ్ ఇచ్చింది.
TCS Work From Office:
వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కే మొగ్గు..
టీసీఎస్ కంపెనీ ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ (Work From Office) రూల్‌కి అందరూ కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్‌కి రావాలన్న నిబంధనని అందరూ పాటించాలని ఆదేశించింది. ఒకవేళ ఉద్యోగులెవరైనా ఆఫీస్‌కి రాకుండా ఉంటే...కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. "వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనే కంపెనీ రూల్ ప్రకారం ఉద్యోగులందరూ కచ్చితంగా ఆఫీస్‌కి రావాల్సిందే. తక్షణమే ఇది అమలవ్వాల్సిందే" అని ఉద్యోగులందరికీ మెమో పంపింది. కంపెనీ పాలసీ ఏంటో అర్థం కావాలంటే ఆఫీస్‌కి వచ్చి పని చేయక తప్పదని చెబుతోంది TCS.గత రెండేళ్లలో చాలా మంది కొత్త ఎంప్లాయిస్ కంపెనీలో చేరారని,మెరుగైన ఫలితాలు సాధించాలంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌కే ప్రయారిటీ ఇవ్వాలని వెల్లడించింది. ఉద్యోగులందరూ రూల్స్ ఫాలో అవుతున్నారని తెలుసుకోడానికి, వర్క్ కల్చర్‌ని ఇంకా మెరుగుపరుచుకోడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎంతో ఉపోయోగపడుతుందని కంపెనీ అభిప్రాయపడుతోంది. నెలలో కనీసం 12 రోజులు ఆఫీస్‌కి రావాలని కండీషన్ పెట్టింది టీసీఎస్. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఉద్యోగులు ఈ రూల్‌ని ఫాలో అవ్వాలని తేల్చి చెబుతోంది. అయితే..ఈ రూల్ ఫాలో అవ్వని వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం కంపెనీ ప్రస్తుతానికి స్పష్టంగా చెప్పలేదు.
"మా క్యాంపస్‌లన్నీ ఉద్యోగులతో కళకళలాడాలని భావిస్తున్నాం. వాళ్ల ఎనర్జీతో నిండిపోవాలని అనుకుంటున్నాం. గత రెండేళ్లలో చాలా మంది ఉద్యోగులు టీసీఎస్‌లో చేరారు. వాళ్లందరికీ మా కంపెనీ పాలసీలు ఏంటో అర్థం కావాలి. ఇక్కడి వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కొత్తవి నేర్చుకోవాలి. అందరితో కలివిడిగా ఉండాలి. ఆనందంగా గడపాలి. అప్పుడే కంపెనీ గ్రోత్ సాధ్యపడుతుంది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు ఆఫీస్‌కి వస్తున్నారు. మా రిజల్ట్స్‌పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్లు మాత్రమే కాదు. అందరూ వారానికి మూడు సార్లు ఆఫీస్‌కి వచ్చి పని చేయాలని మేం భావిస్తున్నాం"
- టీసీఎస్
ఆసక్తికర సర్వే
ఇటీవలే ఓ ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. Gallup Research Study ప్రకారం...పాండెమిక్ తరవాత కేవలం 9% మంది మాత్రమే ఆఫీస్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. 32% మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ఓటు వేస్తున్నారు. 59% మంది హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెప్పారు. అయితే..హైబ్రిడ్ వర్క్ మోడల్‌లో ఎన్ని రోజులు ఆఫీస్‌కు రావాలన్న క్లారిటీ కొన్ని కంపెనీలు ఇవ్వడం లేదు. ఉద్యోగులే తమ వీలు ప్రకారం ఆఫీస్‌లకు వెళ్తున్నారు. అయితే...మేనేజర్‌లకు ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. చాలా మంది ఎంప్లాయిస్ ఆఫీస్‌కు వచ్చి పని చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రొడక్టివిటీ తగ్గిపోతుందని ఎంతగా చెబుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఒత్తిడి చేస్తే కంపెనీ మారిపోతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ప్రొడక్టివిటీ తగ్గుతుందన్న వాదనను కొట్టి పారేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అధ్యయనం ప్రకారం..11 దేశాల్లోని 20 వేల మందిని విచారించగా...87% మంది WFHతో ప్రొడక్టివిటీ పెరిగిందని తేల్చి చెప్పారు. 12% మంది టీమ్ లీడర్స్ కూడా దీన్ని అంగీకరిస్తున్నారు.