అన్వేషించండి

CM Vijay: తమిళనాడులో మళ్ళీ అమ్మ మెనూ.. రూ.1కే ఇడ్లీ , రూ.5కే భోజనం - పూర్తిగా మార్చేస్తున్న విజయ్

Tamil Nadu Amma Canteen: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అమ్మ క్యాంటీన్ల పునరుద్ధరణకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 620 క్యాంటీన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల, నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.

CM Vijay Amma Canteen: తమిళనాడు రాజకీయాల్లో  కొత్త ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఒక సంచలన నిర్ణయం సామాన్యుల ఆకలి తీర్చనుంది. దివంగత జె. జయలలిత ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన  అమ్మ క్యాంటీన్ల పూర్వ వైభవం కోసం ఆయన నడుం బిగించారు. రాజకీయాలకు అతీతంగా, ఆకలి విలువ తెలిసిన నేతగా విజయ్ ఈ పథకాన్ని పునరుద్ధరించాలని ఆదేశించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

 మళ్ళీ కనిపిస్తున్న రూపాయి ఇడ్లీ ముచ్చట! 

ఒకప్పుడు నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, పేద వృద్ధులకు ఆకలి తీర్చే దేవాలయాలుగా వెలిగిన అమ్మ క్యాంటీన్లు.. గత కొన్నాళ్లుగా నిర్వహణ లోపంతో వెలవెలబోయాయి. శిథిలమైన కిచెన్ మౌలిక సదుపాయాలు, నాణ్యత లేని భోజనంపై వస్తున్న ఫిర్యాదులపై సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 620 క్యాంటీన్లను వెంటనే మరమ్మతులు చేయాలని, ఆధునిక వంట సామగ్రిని సమకూర్చాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రూపాయికే ఇడ్లీ, మూడు రూపాయలకే పెరుగన్నం, ఐదు రూపాయలకే సాంబార్ అన్నం.. మళ్ళీ అదే రుచితో ప్రజలకు అందేలా చూడాలని ఆయన పట్టుబడుతున్నారు.

 ఆకలి తీర్చిన 'అమ్మ' అస్త్రం.. 

2013లో జయలలిత ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక సంచలనం. కేవలం తక్కువ ధరకు భోజనం పెట్టడమే కాకుండా, పోషకాహార లోపాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. కోవిడ్ మహమ్మారి సమయంలో వేలాది మంది వలస కూలీల ప్రాణాలను కాపాడింది ఈ అమ్మ క్యాంటీన్లే. ఆటో డ్రైవర్ల నుంచి ఆఫీసులకు వెళ్లే సామాన్యుల వరకు అందరికీ ఇవి ఇష్టమైన అడ్డాలుగా మారాయి. అయితే రాజకీయ కారణాల వల్ల మధ్యలో నిధుల కొరత ఏర్పడి, ఈ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన నెలకొంది.  

 రాజకీయాలకు అతీతంగా విజయ్ అడుగు.. 

సాధారణంగా కొత్తగా వచ్చే ప్రభుత్వాలు పాత ప్రభుత్వం పేరున్న పథకాలను అటకెక్కిస్తాయి. కానీ, విజయ్ మాత్రం ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని భావించారు. గత డీఎంకే ప్రభుత్వం వీటిని కొనసాగించినప్పటికీ, నిర్వహణలో అలసత్వం వహించిందని అన్నాడీఎంకే ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు విజయ్ ఈ ప్రాజెక్టును తన భుజస్కంధాలపైకి తీసుకోవడం ద్వారా, తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని అందించే  ద్రవిడ సంక్షేమ నమూనా'ను కాపాడాలని నిర్ణయించుకున్నారు. చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 383 సెంటర్లతో సహా అన్ని జిల్లాల్లోని క్యాంటీన్లకు నిధుల విడుదల సులభతరం చేశారు.

 సామాన్యుడి 'ఫుడ్ కల్చర్'కు పునర్జీవం.. 

ఇది కేవలం ఒక భోజన పథకం మాత్రమే కాదు, తమిళనాడు జీవనశైలిలో ఒక భాగం. హోటళ్లలో టిఫిన్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేటి కాలంలో, రూపాయి ఇడ్లీ అనేది ఒక కలలా అనిపిస్తుంది. కానీ, ఆ కలను నిజం చేస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన వేడి వేడి భోజనాన్ని అందించడానికి యంత్రాంగం సిద్ధమైంది. కిచెన్ అప్‌గ్రేడ్, కొత్త నీటి ఫిల్టర్లు, సరిపడా పాత్రలను సమకూర్చడం ద్వారా అమ్మ క్యాంటీన్లు మళ్ళీ పాత కళను సంతరించుకోనున్నాయి. ఆకలి లేని తమిళనాడు లక్ష్యంగా విజయ్ వేస్తున్న ఈ అడుగు సామాన్యుడికి పెద్ద ఊరట. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Fitness:  బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
బుమ్రా ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్.. శ్రీలంక సిరీస్ కి యార్కర్ కింగ్ కంబ్యాక్!
CWG Historic Gold: జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భార‌త్ !
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 31 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget