CWG Historic Gold: జూడోలో హర్ష్, అస్మిత సరికొత్త రికార్డు.. బాక్సింగ్, అథ్లెటిక్స్ లో మెడల్స్ సునామీ, గ్లాస్గో గేమ్స్ లో దూసుకుపోయిన భారత్ !
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో జూడో స్టార్స్ హర్ష్ సింగ్, అస్మిత డే హిస్టారిక్ గోల్డ్ మెడల్స్ సాధించి ఇండియా డ్రీమ్ రన్ కంటిన్యూ చేశారు.

Commonwealth Games Historic Judo Gold For India: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 డే 9 లో ఇండియన్ జూడో స్టార్స్ హర్ష్ సింగ్, అస్మిత డే హిస్టారిక్ డబుల్ తో అమేజింగ్ రికార్డ్ సృష్టించారు. తమ తమ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ సాధించడం ద్వారా సీడబ్ల్యూజీ జూడోలో టాప్ పొజిషన్ సాధించిన ఫస్ట్ ఇండియన్ మేల్, ఫిమేల్ జూడోకాస్‌గా వీళ్లు హిస్టరీ బుక్స్ లోకి ఎక్కారు. మరోవైపు బాక్సింగ్ లో ప్రీతి పవార్, అంకుష్ పంగాల్, జైస్మిన్ లాంబోరియా, జడుమణి సింగ్, అరుంధతి చౌదరి శనివారం జరగబోయే ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యారు. ఇండియా ఇప్పటివరకు 19 మెడల్స్ (5 గోల్డ్, 10 సిల్వర్, 4 బ్రాంజ్) గెలుచుకుని మెడల్స్ టాలీలో 8వ స్థానంలో నిలిచింది. మరో 11 మెడల్స్ ఖాయమవ్వడంతో మెడల్స్ కౌంట్ పెరగడం పక్కా అని తెలుస్తోంది.
T-6795: congratulations to Asmita Dey and Harsh Singh for winning Gold🥇for 🇮🇳 in Judo during #CWG_2026 pic.twitter.com/GI99x5pTHq
— Dhruv trivedi (@Dhruvtrivedi5) July 31, 2026
నీరజ్ చోప్రా జావెలిన త్రో ఫైనల్.. గోల్డ్ మెడల్ పై ఫోకస్
మాజీ ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మెన్స్ జావెలిన త్రో ఫైనల్ లో ఈరోజు లేట్ నైట్ బరిలోకి దిగనున్నాడు. అతనికి తోడుగా రోహిత్ యాదవ్, యష్ వీర్ సింగ్ లు కూడా ఫైనల్ పోరులో గోల్డ్ మెడల్ కోసం ఫైట్ చేయనున్నారు. బాక్సింగ్ సెమీఫైనల్స్ లో లవ్లీనా బోర్గోహైన్, సచిన్ శివాచ్, నరేందర్ బెర్వాల్, ప్రియా ఘంగాస్ లు పోటీ పడుతున్నారు.
If you're planning to sleep early tonight, DON'T! 😄
— India_AllSports (@India_AllSports) July 31, 2026
Still to come:
➡️ Neeraj Chopra, Yash Vir Singh & Rohit Yadav in Javelin Throw FINAL | 12:45 AM
➡️ 5 Boxing Semi-Final bouts
➡️ Tejaswin Shankar's final two Decathlon events
➡️ Yashas & Santhosh in 400m Hurdles FINAL… pic.twitter.com/QgtuTRTVpV
జూడో ఫైనల్ మ్యాచ్ లో యామిన్ మౌర్య.. డెకాథ్లాన్ లో తేజస్విన్ శంకర్
ఉమెన్స్ 57 కేజీల జూడో ఫైనల్ లో యామిన్ మౌర్య ఇంగ్లాండ్ కి చెందిన అసిల్యా తోప్పాక్ తో గోల్డ్ కోసం ఫైట్ చేయనుంది. అథ్లెటిక్స్ లో తేజస్విన్ శంకర్ మెన్స్ డెకాథ్లాన్ 1500 మీటర్ల లాస్ట్ ఈవెంట్ లో మెడల్ కోసం రేసులో ఉన్నాడు. మెన్స్ 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ లో యశస్ పలాక్ష, సంతోష్ కుమార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
డే 9 మెడల్స్ ఈవెంట్స్ కంప్లీట్ షెడ్యూల్ వివరాలు
10:20 PM: జూడో - యామిన్ మౌర్య వర్సెస్ అసిల్యా తోప్పాక్ (ఉమెన్స్ 57 కేజీల ఫైనల్)
12:15 AM: బాక్సింగ్ - ప్రియా ఘంగాస్ వర్సెస్ లూసీ (ఉమెన్స్ 60 కేజీల సెమీఫైనల్)
12:45 AM: అథ్లెటిక్స్ - నీరజ్ చోప్రా, రోహిత్, యష్ వీర్ (మెన్స్ జావెలిన త్రో ఫైనల్)
12:45 AM: బాక్సింగ్ - లవ్లీనా బోర్గోహైన్ వర్సెస్ తరోనా (ఉమెన్స్ 75 కేజీల సెమీఫైనల్)
1:00 AM: బాక్సింగ్ - సచిన్ శివాచ్ వర్సెస్ ఓవైన్ (మెన్స్ 60 కేజీల సెమీఫైనల్)
1:05 AM: అథ్లెటిక్స్ - తేజస్విన్ శంకర్ (మెన్స్ డెకాథ్లాన్ 1500 మీటర్ల ఫైనల్)
1:30 AM: బాక్సింగ్ - నరేందర్ బెర్వాల్ వర్సెస్ నైజెల్ పాల్ (మెన్స్ 90+ కేజీల సెమీఫైనల్)
1:30 AM: అథ్లెటిక్స్ - యశస్ పలాక్ష, సంతోష్ కుమార్ (మెన్స్ 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్)
ట్రెండింగ్ వార్తలు






















