By: Ram Manohar | Updated at : 06 Jul 2022 04:15 PM (IST)
గుర్రంపై స్వారీ చేస్తూ కనిపించిన ఫుడ్ డెలివరీ బాయ్‌ని గుర్తు పట్టిన వాళ్లకి రివార్డ్ ప్రకటించిన స్విగ్గీ
ఫుడీస్‌కు విజ్ఞప్తి: స్విగ్గీ సంస్థ ప్రకటన
గుర్రంపై స్వారీ చేస్తూ ఫుడ్ డెలివరీ చేయటానికి వెళ్లిన వ్యక్తి వీడియో ఇటీవల వైరల్ అయింది. అయితే ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రఅందులో స్పష్టంగా కనిపించలేదు. స్విగ్గీ కూడా ఆ వ్యక్తిని కరెక్ట్‌గా గుర్తు పట్టలేకపోయింది. అందుకే కస్టమర్స్‌కి ఓ ఆఫర్ ఇచ్చింది. గుర్రంపై ఉన్న వ్యక్తి ఎవరో చెప్పిన వారికి రూ.5 వేల రివార్డు ప్రకటించింది. "ఫుడీస్‌కి, నెటిజన్స్‌కి విజ్ఞప్తి. స్విగ్గీ డెలివరీ బాయ్ గుర్రంపై వెళ్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. కానీ మేము ఆ వ్యక్తిని గుర్తు పట్టలేకపోయాం. అతని బ్యాక్‌ప్యాక్‌లో ఏముంది..? అంత వర్షంలోనూ గుర్రంపై వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..? తను ఫుడ్ డెలివరీ చేయటానికి వెళ్లినప్పుడు గుర్రాన్ని ఎక్కడ ఉంచాడు..? ఈ వివరాలన్నీ కావాలి" అని అడిగింది. "ఈ బ్రాండ్ అంబాసిడర్ ఎవరో మాకు చెప్పిన మొదటి వ్యక్తికి రూ.5,000 రివార్డు అందజేస్తాం" అని ప్రకటించింది. "ఇండియా ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకుంటోంది" అని వెల్లడించింది.
సిటీల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి క్షణం తీరిక దొరకట్లేదంటే ఏ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగానే కంపెనీలు వాళ్లకు ఆ బాయ్స్‌కి ఇన్‌సెంటివ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఫలానా టైమ్‌లోగా వెళ్లి ఆర్డర్ అందిస్తే వాళ్లకి మంచి రేటింగ్ కూడా వస్తుంది.
అందుకే ఇన్‌టైమ్‌లో ఆర్డర్ ఇచ్చేందుకు వాళ్లు పడరాని పాట్లు పడుతుంటారు. ఇప్పుడు ముంబయిలోనూ ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఇలా చేసే వార్తల్లోకెక్కాడు. భారీ వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా ఫుడ్‌ను డెలివరీ చేసేందుకు చాలా వేగంగా వెళ్లిపోయాడు. ఎలాగో తెలుసా..? గుర్రంపైన. అవును గుర్రపుస్వారీ చేస్తూ ఆ వర్షంలో తడుస్తూ కనిపించాడు డెలివరీ బాయ్. ఇదంతా ఓ వ్యక్తి తన కార్‌లో నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇది నెట్టింట గుర్రం కన్నా వేగంగా చక్కర్లు కొడుతోంది.
I think you are looking for him. pic.twitter.com/mpuz3vIsbA
— ketan jindal (@ketanjindal_) July 5, 2022
That's Ranjhor ka Rathore, Jay!
— Vaidehi🌸✨ (@vaidehiii_m) July 5, 2022
You folks should do a poll wrt everyone in favour of horse-delivered food: Yay or Neigh 🐎
— Anita Rane (@AyeWhatMan) July 5, 2022
Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై
National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్
Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!
Scholarships: ‘మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు, చివరితేది ఇదే!
Kurnool News : 'ఫ్రెండ్ షిప్ డే' నాడు విషాదం, వాగులో కొట్టుకుపోయిన నలుగురు మిత్రులు
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!