Surpreme Court: యూపీలో కాలుష్యానికి పాకిస్తాన్ గాలే కారణం... సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వం వాదనలు... పాక్ పరిశ్రమల్ని మూసివేయాలా ధర్మాసనం ప్రశ్న
దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పాక్ గాలే కాలుష్యానికి కారణమని యూపీ తరఫున వాదిస్తున్న న్యాయవాది అనగా పాక్ లోని పరిశ్రమలు మూసివేయాలా అని సుప్రీం ప్రశ్నించింది.

దిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్రానికి బాధ్యత అంటూ దిల్లీ ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదని కేంద్రం నిందించుకోవడం సుప్రీంకోర్టులో తరచుగా జరుగుతుంది. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో రైతులు పంట మేడులు తగలబెట్టడం వల్లే కాలుష్యం పెరిగిపోతుందని దిల్లీ ప్రభుత్వం తప్పుబడుతుంది. ఇదే విధంగా సుప్రీంకోర్టులో శుక్రవారం ఓ పిటిషన్ విచారణ సమయంలో ఉత్తరప్రదేశ్ న్యాయవాది యూపీలో పరిశ్రమల మూసివేత సరికాదని, కాలుష్యానికి పాకిస్తాన్ నుంచి వీస్తున్న గాలే కారణమని తప్పుబట్టారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్... సీజేఐ జస్టిస్ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూద్, జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. యూపీలో పరిశ్రమలు మూతపడితే రాష్ట్రంలోని చెరకు, పాల పరిశ్రమలపై ప్రభావం పడుతుందని వాదించారు. చెరకు వ్యాపారంలోని వివిధ అంశాలను వివరించారు. పరిశ్రమల మూసివేత పెద్ద సమస్యకు దారిస్తుందని ధర్మాసనం ముందు న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.
Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!
"పరిశ్రమల మూసివేత చెరకు పరిశ్రమలపై ప్రభావం చూపవచ్చు. ఉత్తరప్రదేశ్ వైపు వీచే గాలి ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వస్తోంది" అని న్యాయవాది రంజిత్ కుమార్ అన్నారు.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బదులిస్తూ.. ‘‘అయితే పాకిస్థాన్‌లో పరిశ్రమలను నిషేధించాలనుకుంటున్నారా? చక్కెర మిల్లులు మూతపడితే రైతులు నష్టపోతారని కుమార్ అన్నారు. ప్రభుత్వం కమిషన్‌ను ఆశ్రయించవచ్చని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం కమిషన్ ముందు ఫిర్యాదును లేవనెత్తడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించింది.
Also Read: Cyclone Jawad: తరుముకొస్తోన్న జవాద్ తుపాను.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూడాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూమి అందుబాటులో ఉందని, అక్కడ విద్యుత్తు ఉత్పత్తికి సౌర ఫలకాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన తెలిపారు. పునరుత్పాదక ఇంధనం అంశాన్ని పరిశీలించాలని ఇప్పటికే కేంద్రానికి చెప్పామని ధర్మాసనం పేర్కొంది. సోలార్ ప్యానెల్స్ పవర్ ప్లాంట్‌లను భర్తీ చేయగలవని సింగ్ వాదించారు.
ఈ వ్యాజ్యంలో విచారణను ముగిస్తూ... కేంద్ర ప్రభుత్వం, GNCTDకి ఆదేశాలు జారీచేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంపై పెండింగ్‌లో పెడుతూ వచ్చే శుక్రవారానికి లిస్ట్ చేసింది. దిల్లీలో తీవ్ర వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 17 ఏళ్ల దిల్లీ విద్యార్థి ఆదిత్య దూబే వేసిన కేసును సుప్రీంకోర్టు విచారించింది.
Also Read: Cyclone Jawad: 'జవాద్' ధాటికి ఒడిశా, ఉత్తరాంధ్రలో హైఅలర్ట్.. రంగంలోకి భారత నేవీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

