అన్వేషించండి

Supreme Court Fires On States : జడ్జిల భద్రతపై స్పందించని రాష్ట్రాలు...లక్ష జరిమానా వేస్తామని సుప్రీంకోర్టు హెచ్చరిక !

న్యాయమూర్తుల భద్రత విషయంలో అఫిడవిట్ దాఖలు చేయని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో దాఖలు చేయకపోతే రూ. లక్ష జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

న్యాయమూర్తులు, లాయర్ల భద్రతకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలన్న ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జార్ఖండ్‌లో జడ్జి హత్య ఘటనపై సుమోటోగా విచారణ  జరుపుతున్న సుప్రీంకోర్టు గత విచారణంలో  న్యాయమూర్తులు, లాయర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. వారి భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై అన్ని రాష్ట్రాలు ప్రత్యేక అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే..  ఏపీ, తెలంగాణ, జార్ఖండ్, మిజోరం, మణిపూర్ రాష్ట్రాలు మాత్రం అఫిడవిట్ లు దాఖలు చేయలేదు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రూ. లక్ష జరిమానా విధిస్తామని ధర్మాసనం ప్రకటించింది.  వారం రోజుల సమయం ఇచ్చామని.. బార్ కౌన్సిల్ కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. లేకపోతే చీఫ్ సెక్రటరీలు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.

విచారణ సందర్భంగా  సుప్రీంకోర్టు ధర్మాసనం న్యాయమూర్తుల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. జడ్జిల భద్రత సంబంధించిన అంశాన్ని రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రమే చేపట్టాలని కేంద్రాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయమూర్తుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిపై పదేపదే దాడులు జరుగుతున్నాయని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. జార్ఖండ్‌లోనే జడ్జి  హత్య జరిగినా ఆ రాష్ట్ర ప్రభుత్వం తాము తీసుకుంటున్న భద్రత చర్యల స్థితిగతులను తెలియచేస్తూ అఫిడవిట్ దాఖలు చేయలేదు.  జార్ఖండ్‌కు తీవ్రమైన సీసీటీవీల కొరత ఉందని, అవి కేవలం నేరం జరిగిన దృశ్యాలను మాత్రమే నమోదు చేస్తాయని ... కానీ నేరాలు, బెదిరింపులు జరగకుండా నిరోధించలేదని సుప్రీంకోర్టు తెలిపింది.  

జార్ఖండ్ లోని ధన్ బాద్ లో  జులై 28,2021 తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో జాగింగ్ చేస్తున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను ఆటో ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది.  ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.  ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది.  న్యాయాధికారులు, న్యాయవ్యవస్థ తమ విధులు నిర్వర్తించేలా భద్రత, రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని.. కేంద్రం కూడా బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. 
  .
న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై శారీరకంగానే కాకుండా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం ద్వారా మానసిక దాడికి పాల్పడుతున్నారని. ఇలాంటి కేసుల్లో న్యాయస్థానాలకు సీబీఐ, ఐబీ వంటి దర్యాప్తు సంస్థలు సహకరిచడం లేదని గత విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా న్యాయమూర్తులపై వేధింపులకు సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారణ ముమ్మరం చేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన వారిలో మరో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లుగా ప్రకటించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget