Sultan of Brunei : ఎంత డబ్బుంటే మాత్రం 7 వేల కార్లు కొంటారా ? ఈ సుల్తాన్ కొంటారు !
Brunei : ఎంత పెద్ద కుబేరుడనా అత్యంత ఖరీదైన కార్లు నాలుగో, ఐదో కొనుక్కుంటారు. ఇంకా కార్లంటే ఇష్టమైతే పదే, ఇరయ్యో కొంటారు. కానీ ఆ సుల్తాన్ మాత్రం ఏకంగా ఏడు వేల కార్లు కొన్నారు.
Sultan of Brunei unbelievable car collection worth 5 billion Dollors : ప్రధానమంత్రి నరేంద్రమోదీ దౌర్యపరమైన పర్యటన కోసం బ్రూనై వెళ్లారు. అందుకే ఇప్పుడు బూనై సుల్తాన గురించిన విశేషాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆయన సంపద గురించి పక్కన పెడితే ఆయన వాడే కార్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి ఉంటుంది. ఆ కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆయన గ్యారేజ్‌లో ఏడు వేల కార్లు ఉంటాయి. అవన్నీ చిన్న చిన్నవి కాదు.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన కార్లు, వాటి విలువ మొత్తం ఐదు బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటే మన రూపాయల్లో ఐదు వందల కోట్లు. కేవలం కార్ల కోసమే ఆయన అంత ఖర్చుపెట్టారన్నమాట.
బ్రూనై సుల్తాన్ కార్ కలెక్షన్ లో ఫెరారి ఎఫ్ 40 కార్లు, మెక్ లారెన్ ఎఫ్ 1 కార్లు, రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాదు.. ప్రపంచంలో అత్యంత అరుదుగా లిమిటెడ్ ఎడిషన్ పేరుతో విడుదల చేసే కార్లను కూడా ఆయన కొనుగోలు చేస్తారు. సుల్తాన్ కార్లలో అత్యంత ఖరీదైన బెంట్లీ డామినేటర్ ఇది ఎనభై మిలియన్ డాలర్ల ఖరీదైనది. రోల్స్ రాయిస్ కార్లు ఆరు వందలు ఉన్నాయి. ఇది ప్రపంచ రికార్డు .. గిన్నిస్ రికార్డు కూడా. 450 ఫెరారీ కార్లు, 380 బెంట్లీ కార్లు ఉన్నాయి. ఇతర లగ్జరీ కార్లకు కొదవ లేదు. 2007లో ఆయన కుమార్తెకు గోల్డ్ తో చేసిన రోల్స్ రాయిస్ కారును బహుకరించి అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి, సోషల్ మీడియాలో ఒక్క పోస్టుకు సంపాదన ఎంతంటే!
బ్రూనై సుల్తాన్ ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌లో ఉంటారు. ఇది ఆయన రేంజ్ కు తగ్గట్లుగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈ ప్యాలెస్ రెండు మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. మొత్తం 22 క్యారెట్ల బంగారంతో ప్యాలెస్ మొత్తం ధగధగలాడిపోతుంది. ఈ ప్యాలెస్‌లో 5 ఈత కొలనులు.. 1,700 బెడ్‌రూమ్‌లు ఉంటాయి. సుల్తాన్ ప్రైవేట్ జూ పార్క్ లో ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉంటాయి.
షాపింగ్ మాల్‌లో భారీ డిస్కౌంట్‌లు, తెరిచిన కాసేపటికే ఎగబడ్డ వేలాది మంది - పూర్తిగా లూటీ
బ్రూనైలో ప్రజాస్వామ్యం లేదు. ఆయన సుల్తాన్ గా పాలిస్తున్నారు. యూకే క్వీన్ ఎలిజబెత్ II త ర్వాత ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రెండో చక్రవర్తి సుల్తాన్ హస్సనల్ బోల్కియాగా రికార్డులకు ఎక్కారు.