Sudha Murty: నా కూతురి వల్లే రిషి సునాక్ ప్రధాని అయ్యారు, భర్తను అలా మార్చేసింది - సుధామూర్తి
Sudha Murty: తన కూతురి వల్లే రిషి సునాక్ బ్రిటన్‌కు ప్రధాని అయ్యారని సుధామూర్తి అన్నారు.
Sudha Murty:
వీడియో వైరల్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్...ఇన్‌ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడే అన్న సంగతి తెలిసిందే. సునాక్ అత్తగారు, ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్ అయిన సుధామూర్తి అల్లుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కూతురు అక్షతా మూర్తి కారణంగానే సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యారని అన్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సుధామూర్తి తన భర్త నారాయణ మూర్తి గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"నేను నా భర్తను (నారాయణ మూర్తి) బిజినెస్‌మేన్‌ని చేశాను. అదే విధంగా నా కూతురు అక్షతా మూర్తి రిషి సునాక్‌ను ప్రధాని స్థాయికి తీసుకెళ్లింది. ఆయన ప్రధాని అవ్వడానికి కారణం నా కూతురే. ఓ భార్య భర్తను ఎంత గొప్పగా మార్చగలదో చెప్పడానికి ఇవే ఉదాహరణలు. నా భర్తను నేను మార్చడం మాత్రే కాదు. ఆయనను సంపూర్ణ వ్యక్తిగా తీర్చి దిద్దాను"
- సుధామూర్తి, ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్
View this post on Instagram
అక్షతా మూర్తి..సునాక్‌ను చాలా విధాలుగా మార్చేసిందని అన్నారు సుధామూర్తి. ఇదే సమయంలో గురువారానికి తమ ఫ్యామిలీకి ఉన్న సెంటిమెంట్‌నీ వివరించారు.
"నా కూతురు రిషి సునాక్‌పై చాలా విషయాల్లో ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. చాలా అలవాట్లలో మార్పు తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు మార్చేసింది. మరో విషయం. మా ఫ్యామిలీకి గురువారానికి ఓ చిన్న సెంటిమెంట్ ఉంది. మా కంపెనీని మేం గురువారమే ప్రారంభించాం. ఇదే విషయాన్ని రిషి సునాక్ ఓ సారి నా కూతురుని అడిగారు. ఈ గురువారానికి మా ఫ్యామిలీకి ఉన్న లింక్‌ని నా కూతురు సునాక్‌కు వివరించింది. ఇప్పుడు సునాక్ కూడా ప్రతి గురువారం ఉపవాసం ఉంటున్నారు. ఇదంతా నా కూతురి వల్లే సాధ్యమైంది"
- సుధామూర్తి, ఇన్‌ఫోసిస్ ఛైర్‌పర్సన్
ప్రసాదం వడ్డించిన సుధామూర్తి..
ఇన్‌ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి గురించి పరిచయమే అక్కర్లేదు. రచయితగా, వక్తగా, సామాజిక సేవకురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతకు మించి ఆమె సింప్లిసిటీ అందరినీ ఆకట్టుకుంటుంది. పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించినా..ఆమె మాత్రం ఎప్పుడూ సింపుల్‌గానే కనిపిస్తారు. ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడి వాళ్లతో ఇట్టే కలిసిపోతారు. ఇటీవల కేరళలోని Pongala వేడుకల్లో పాల్గొన్న సుధామూర్తి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరువనంతపురంలోని అట్టుకల్ భగవతి ఆలయంలో ఓ సామాన్యురాలిగా కింద కూర్చుని భక్తులందరికీ పొంగళిని వడ్డించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో ఆమె కాసేపు ప్రసాదం వితరణ చేశారు. ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్‌ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణిగా, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తయ్యగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో చరిష్మా ఉన్న సుధామూర్తి ఇంత సింపుల్‌గా కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.
She comes from a wealthy family with a net worth exceeding ₹35,000,00,00,000 and her son-in-law happens to be the UK PM.
— P C Mohan (@PCMohanMP) March 9, 2023
She is a highly accomplished woman.
She remains down-to-earth and committed to preserving Indian tradition.
She is Padma Bhushan Sudha Murthy. pic.twitter.com/QN4wwFuQok
Also Read: Karnataka Elections 2023: సోనియా గాంధీ ఓ విషకన్య, పాక్ చైనాకి ఏజెంట్లా పని చేశారు - బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు