మాఘ ఫౌర్ణమి రోజున ఆ గ్రామమంతా ఖాళీ, పొరపాటున అగ్గి గాని, లైట్ గానీ వెలిగిస్తే అంతే సంగతులు
మాఘ పౌర్ణమి రోజున తలారి చెరువలో అగ్గిపాడు అనే ఆచారం పేరుతో ఊరును ఖాళీ చేస్తారు. తెల్లవారు జామున నుంచి అర్దరాత్రి వరకు ఆ గ్రామంలో ఎవ్వరూ ఉండరు.
ఆ గ్రామంలో మాఘ మాసం పౌర్ణమి రోజు అగ్గి వెలిగించరు. పౌర్ణమి రోజు గ్రామస్తులు తమ కుటుంబ సభ్యుతోపాటు పెంపుడు జంతువులను తీసుకొని గ్రామాన్ని ఖాళీ చేస్తారు. మరుసటి రోజు తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తలారిచెరువులో గ్రామంలో అగ్గిపాడు అనే పేరుతో ఈ వింత ఆచారం కొనసాగిస్తున్నారు.
అగ్గిపాడు ఆచారాన్ని వనభోజనాలుగా మార్చుకుని గ్రామస్తులందరు ఒకచోట చేరి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారిచెరువులో కొనసాగుతున్న ఈ ఆచారం సమీప గ్రామ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
తాడిపత్రి పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. పక్కనే సిమెంట్స్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఏటా ఇలా మాఘమాసం పౌర్ణమి రోజున ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఎందుకని అడిగితే ఈ గ్రామ ప్రజలు... పురాతనమైన ఓ కథను చెబుతారు.
400 ఏళ్ల క్రితం గ్రామంలో ఓ బ్రాహ్మణుడు తన అనుచరులతో కలిసి తలారి చెరువుపై దాడి చేసి దొరికిన ధాన్యాన్ని, ధనాన్ని దోచుకుని పోయాడు. గ్రామస్తులు అతన్ని వెంబడించి పట్టుకొని కొట్టేశారు. ఆ దెబ్బలకు ఆ బ్రాహ్మణుడు చనిపోతూ శాపం పెట్టాడట. గ్రామం సుభిక్షంగా ఉండకూడదని, పుట్టిన వెంటనే బిడ్డలు మరణిస్తారని, కరవు కాటకాలతో అల్లాడుతూ నష్టపోవాలని శపించినట్లు చెబుతారు గ్రామస్తులు.
బ్రాహ్మణుడి శాపంతో గ్రామంలో వంటలు పండక, పుట్టిన బిడ్డలు మరణించారని ఈ ప్రభావంతో చాలా మంది ఊరు విడిచి పెట్టి వెళ్లిపోయారని చెబుతున్నారు. కొందరు గ్రామస్తుల సలహాతో చిత్తూరు జిల్లాచంద్రగిరి వెళ్లి జ్యోతిష్యుణ్ని కలిస్తే విరుడుగు ఉపాయం చెప్పారని చెబుతున్నారు. గ్రామంలోని వారు మాఘచతుర్థశి అర్థరాత్రి నుంచి పౌర్ణమి అర్ధరాత్రి వరకు ఆ గ్రామంలో ఎలాంటి అగ్గిగాని, వెలుతురు గాని లేకుండా దక్షిణంవైపు వెళ్లాలని చెప్పారు.
జ్యోతిష్యుడి సలహా మేరకు అగ్గిపాడు ఆచారాన్ని పాటిస్తూ గ్రామానికి దక్షిణంవైపు ఉన్న హాజవలి దర్గాకు వెళ్లడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కష్టాలు తగ్గాయని గ్రామస్తుల నమ్మకం. అందుకే ఏటా మాఘ చతుర్దశి రోజున అక్కడే గడిపి ఆటపాటలు, వనభోజనాలతో సరదాగా చేసుకుంటున్నారు. గ్రామంతోపాటు వారి బంధువులు అందరు కలిసి హాజవలి దర్గాలో పశువులు, పిల్లాపాపలు, ముసలివారితో సహా గ్రామం వదిలి మాఘచతుర్ధశి అర్ధరాత్రి నుంచి మాఘపౌర్ణమి అర్ధరాత్రి వరకు గ్రామంలో అగ్గిగాని, లైట్లుగాని వెలిగించకుండా ఆచారం కొనసాగిస్తున్నారు.
Watch Video: వనాల నుంచి గద్దెలపైకి వెళ్లనున్న సమ్మక్క