Mumbai unemployed: చిరు ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఉప్పెన - ముంబై ఎయిర్ పోర్ట్ జామ్
Mumbai Airport : ఎయిర్ పోర్టులో పాతిక వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాల కోసం యువత ఎగబడ్డారు. ఫలితంగా ముంబైలోని కాలినా ఎయిర్ పోర్టు వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది.
Stampede-like situation in Mumbai over jobs : దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న ఉద్యోగం కోసం ప్రకటన ఇస్తే వందల మంది పోటీ పడుతున్నారు. తాజాగా ఇలాంటి పరిస్థితి ముంబై ఎయిర్ పోర్టు దగ్గర కనిపిచింది. రెండు వేల లోడర్ పోస్టుల భర్తీ కోసం ఎయిర్ ఇండియా వాక్ ఇన్ కు పిలుపునిచ్చింది. దీంతో ఒక్క సారిగా పాతిక వేల మందికిపైగా తరలి వచ్చారు. ఈ పోస్టులకు సాధారణ విద్యార్హతలు సరిపోతాయి. ఫిజికల్‌గా స్ట్రాంగ్ గా ఉండే సరిపోతుంది. అందుకే విపరీతంగా జరిగింది.
FOR EMPLOYMENT.
— Shakeel Yasar Ullah (@yasarullah) July 17, 2024
Thousands of people turned up in Mumbai's Kalina for a walk-in interview at Air India Airport Services Ltd.
Unemployment in India at its peak. pic.twitter.com/r4XuM5GBCI
ఎయిర్‌పోర్ట్ లోడర్‌లు విమానంలో లగేజీని లోడ్ చేయడం, బ్యాగేజ్ బెల్టులు, ర్యాంప్ ట్రాక్టర్‌లను ఆపరేట్ చేయడం వీరి విధులు. ప్రతి విమానానికి కనీసం ఐదుగురు లోడర్లు అవసరం ఉంటారు. జీతం నెలకు రూ.20,000 నుండి రూ. 25,000 వరకు ఉంటుంది. ఓవర్‌టైమ్ అలవెన్సులతో కలిపి సుమారు రూ.30,000 వరకు ఉండవచ్చు. అభ్యర్థులంతా కార్యాలయానికి చేరుకోవడంతో తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిని నియంత్రించలేక సిబ్బంది నానా అవస్థలు పడ్డారు. కౌంటర్‌ను చేరుకునేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడటంతో పలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
దేశంలో నిరుద్యోగిత పెరుగుతోదంని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో నిరుద్యోగశాతం 6.3 ఉండగా, జూన్‌లో 9.3కు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో చూస్తే...మే నెలలో 8.6 ఉండగా, జూన్ నాటికి 8.9 శాతానికి పెరిగినట్లుగా తెలుస్తోంది.సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(సీఎంఐఈ) నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.౩ శాతానికి పెరిగినట్టు సీఎంఐఈ వెల్లడించింది. చిన్న చిన్న ఉద్యోగాలకు అయినా జనం వెల్లువలా వస్తూంటారు. అత్యధిక అర్హతులు ఉన్న వాళ్లు కూడా వస్తూండటంతో దేశంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం కలుగుతూ ఉంటుంది.
అయితే నాన్ స్కిల్డ్ ఉద్యోగాల కోసం ఇలాంటి ప్రకటనలు ఎక్కడ ఇచ్చినా వెల్లువలా వస్తారని.. ఎయిర్ ఇండియాను ఇప్పికీ ప్రభుత్వ సంస్థగా చాలా మంది భావిస్తూండటం వల్ల.. నాలుగైదు వందల కిలోమీటర్ల నుంచి జన వచ్చి ఉంటారని భావిస్తున్నారు.