Srinagar Encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం
శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లకు గాయాలయ్యాయి.

జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. పంథా చౌక్ ప్రాంతంలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఇందులో ఒకరికి జైషే మహ్మద్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారు.
ఏం జరిగింది?
పంథా చౌక్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారాన్ని అందుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే భద్రతాదళాలపై ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో ఇది ఎన్‌కౌంటర్‌కు దారి తీసింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు, మరో సీఆర్‌పీఎఫ్ జవానుకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆరుగురు హతం..
అనంతనాగ్ జిల్లాలోని నౌగామ్ షాహ్‌బాద్, కుల్గాం జిల్లాల్లో నిన్న జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మొత్తం ఆరుగురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో మొత్తం నాలుగు ఏకే 47, రెండు ఎం4 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజీపీ తెలిపారు. ఆ రెండు ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ గాలింపు చేపడుతున్నట్లు ఐజీపీ పేర్కొన్నారు.
రెండు ఘటనల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని, జవాన్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కశ్మీర్ ఐజీపీ తెలిపారు.
Also Read: Omicron Cases India: దేశంలో కొత్తగా 16,764 మందికి కరోనా.. 1200 దాటిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Covaxin: పిల్లలపై 'కొవాగ్జిన్' ఉత్తమ ఫలితాలు.. తుది దశ ఫలితాలు వెల్లడించిన భారత్ బయోటెక్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
Before You Go
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
ట్రెండింగ్ వార్తలు























