Prabhakaran alive: ప్రభాకరన్ బతికున్నారన్న వార్తలు అవాస్తవం, మా దగ్గర అన్ని ఆధారాలున్నాయి - ABPతో శ్రీలంక సైన్యం బ్రిగేడియర్
Prabhakaran alive: ప్రభాకరన్ చనిపోయాడు అనడానికి అన్ని ఆధారాలున్నాయని శ్రీలంక ఆర్మీ బ్రిగేడియర్ ABP Newsతో చెప్పారు.
Prabhakaran Alive:
DNA రిపోర్ట్ కూడా ఉంది: బ్రిగేడియర్
LTTE చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ తమిళ నేషనలిస్ట్ లీడర్ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి. ఎప్పుడో 2009లోనే శ్రీలంక సైన్యం ఆయనను మట్టుపెట్టింది. ప్రభాకరన్ చనిపోయినట్టు ఫోటోలు విడుదల చేసి మరీ ప్రకటించింది. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన బతికే ఉన్నారంటూ నెడుమారన్ చెప్పడంపై చర్చ జరుగుతోంది. అయితే..ఈ వ్యాఖ్యలపై శ్రీలంక సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్‌తో ప్రత్యేకంగా మాట్లాడింది ABP News. ప్రభాకరన్ బతికున్నారన్న వార్తలపై స్పందించిన ఆయన ఆ వ్యాఖ్యల్ని కొట్టి పారేశారు. ఆయన చనిపోయాడు అనడానికి DNA రిపోర్ట్‌తో సహా అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అన్ని విధాలుగా ధ్రువీకరించుకున్నాకే ప్రభాకరన్ చనిపోయినట్టు ప్రకటించాలని తేల్చి చెప్పారు. ఆయన బతికే ఉన్నారటానికి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. ఏ ఆధారాలతో అలాంటి వ్యాఖ్యలు చేశారో నెడుమారన్‌నే అడగాలని అన్నారు. ప్రభాకరన్ చనిపోయారనటానికి శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు చూపించలేదని నెడుమారన్ చేసిన వ్యాఖ్యలకూ బదులిచ్చారు బ్రిగేడియర్ రవి హెరాత్. 2009లో శ్రీలంక సైన్యానికి, LTTEకి మధ్య జరిగిన కాల్పుల్లో ప్రభాకరన్ చనిపోయారని స్పష్టం చేశారు. అవసరమైతే శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడి ఇది కన్‌ఫమ్ చేసుకోవచ్చని చెప్పారు. శ్రీలంక ప్రభుత్వం ఈ వ్యాఖ్యలపై స్పందించిందా అని ABP News ప్రశ్నించగా...ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదని అన్నారు.
Also Read: Go Ahead Fire Me: ఉద్యోగం పోతే పోయింది కానీ చాలా హ్యాపీగా ఉంది, నచ్చిన పని చేసుకుంటాం - నయా ట్రెండ్