News
News
X

Sri Lanka Crisis: బెడ్రూంలో సెల్ఫీలు- స్విమ్మింగ్ పూల్‌లో ఆటలు- శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో ప్రజల రచ్చరచ్చ

శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి ఆందోళనకారులు చొరబడ్డారు. పూల్‌లోకి దూకి స్విమ్మింగ్‌ చేశారు.

FOLLOW US: 

అధ్యక్షుడు రాజపక్స ఇంట్లోకి ఆందోళనకారులు

శ్రీలంకలో సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు తగ్గిపోయి, సరుకులు దిగుమతులు నిలిచిపోయి, పడరాని కష్టాలు పడుతోంది ఈ ద్వీప దేశం. దేశానికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన గొటబయ రాజపక్స వెంటనే అధికారం నుంచి తప్పుకోవాలని దాదాపు మూడు నెలలుగా అక్కడి ప్రజలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు. రాజపక్స ప్రజల కంట పడకుండా ఇంట్లో దాక్కున్నారు. అందుకే ప్రజలు రోడ్లపైన కాకుండా నేరుగా ఆయన ఇంటికే వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. పోలీసులు వచ్చి చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నా..ఏ మాత్రం భయపడటం లేదు నిరసనకారులు. ఇప్పట్లో ఈ ఆగ్రహం చల్లారేలా లేదని, గొటబయ రాజపక్స అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. పరిస్థితుల్నిఅదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. అయినా వాళ్లు వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే వారిపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. ఒక్కసారిగా నిరసనకారులు రాజపక్స ఇంట్లోకి చొరబడ్డారు  

ఆయన నివాసంలోకి చొరబడ్డ ఆందోళనకారులు పూల్‌లో స్విమ్మింగ్‌ చేశారు. వంటగదిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఆహార పదార్థాలు ఆరగించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధ్యక్షుడు రాజపక్సను ఓ రహస్య ప్రాంతానికి సైన్యం తరలించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను అక్కడి మీడియా ప్రసారం చేసింది. కొద్దినెలలుగా శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పట్లో ఈ ఆపద నుంచి బయటపడేలా లేదు. విదేశీ మారక ద్రవ్యం లేక‌పోవ‌డం వల్ల ఆ దేశ అవ‌స‌రాల‌కు స‌రిప‌డే ఇంధ‌నాన్నీ అక్కడి సర్కార్‌ కొనుగోలు చేయలేకపోతోంది. 

Published at : 09 Jul 2022 05:39 PM (IST) Tags: Srilanka srilanka crisis Rajapaksa Srilanka Protesters

సంబంధిత కథనాలు

PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే

PA Deepak: విశాఖ వాసి టాలెంట్‌కు హాలీవుడ్ ఫిదా, 2 గ్రామీలు సాధించిన పీఏ దీపక్ జర్నీ ఇదే

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Mancherial News :  ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

Delhi liquor Scam  : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్‌లో కీలక విషయాలు

టాప్ స్టోరీస్

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?