Vaccination Theme Song: 100 కోట్ల పండగకు రంగం సిద్ధం... ప్రత్యేకమైన థీమ్ సాంగ్ కూడా.. పాడిన ఫేమస్ సింగర్ ఎవరంటే?
కరోనావైరస్ వ్యాక్సినేషన్ డోసులు 100 కోట్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన థీం సాంగ్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా విడుదల చేశారు.
కరోనావైరస్‌పై పోరాటంలో భారతదేశం కొత్త రికార్డుకు అతి చేరువలో ఉంది. కరోనాపై పోరాటంలో ప్రధాన ఆయుధం వ్యాక్సినే. త్వరలో మనదేశంలో వ్యాక్సినేషన్లు 100 కోట్ల మార్కును దాటనున్నాయి. ఈ ప్రత్యేక సందర్భం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన థీమ్ సాంగ్‌ను కూడా రూపొందించారు. ఒక్కసారి వ్యాక్సినేషన్ 100 కోట్ల మార్కును దాటాక రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, బస్ స్టాండ్లలో ఈ థీమ్ సాంగ్ ప్లే చేయనున్నారు.
భరత్ అనే నేనులో ‘వచ్చాడయ్యో సామి’, మిర్చిలో ‘పండగలా దిగి వచ్చాడు’, అరవింద సమేతలో ‘ఏడ పోయినాడో’ వంటి హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కైలాష్ ఖేర్ ఈ పాటను ఆలపించాడు. ఈ పాటను 100 కోట్ల డోసులు పూర్తయ్యాక విడుదల చేస్తారు. ఇది కాకుండా మరో వ్యాక్సినేషన్ ప్రమోషన్ సాంగ్‌ను ఇప్పటికే లాంచ్ చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రమోట్ చేయడానికి ఈ పాటను రూపొందించారు. కేంద్ర పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో ఆయిల్, గ్యాస్ కంపెనీలు ఈ పాటను నిర్మించారు. సోమవారం నాటికి 100 కోట్ల వ్యాక్సినేషన్ మార్కును చేరుకుంటామని అంచనా.
टीके से बचा है देश टीके से
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) October 16, 2021
टीके से बचेगा देश टीके से....#BharatKaTikakaran pic.twitter.com/aXfB8n65J7
కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవ్యా ఏమన్నారంటే?
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా మాట్లాడుతూ దేశంలో 97 కోట్ల మందికి పైగా ప్రజలు ఇప్పటికే మొదటి డోస్‌ను తీసుకున్నారని తెలిపారు. దేశంలోని శాస్త్రవేత్తలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నమ్మకం ఉంచారని, మనదేశంలో రూపొందిన వ్యాక్సిన్‌నే వేస్తున్నామని పేర్కొన్నారు. దీని కోసం పక్క దేశాలపై ఆధారపడలేదన్నారు. రానున్న రోజుల్లో 100 కోట్ల డోసుల మార్కును దాటతామని తెలిపారు.
100 కోట్ల మార్కును దాటిన తర్వాత కైలాష్ ఖేర్ పాడిన ప్రత్యేకమైన థీమ్ సాంగ్‌ను విడుదల చేస్తామన్నారు. అన్ని పబ్లిక్ ప్లేసెస్‌లో ఈ పాటను ప్లే చేస్తామని పేర్కొన్నారు. నేడు విడుదలైన వ్యాక్సినేషన్ ప్రమోషన్ సాంగ్‌ను ఆయిల్, గ్యాస్ కంపెనీలు పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో రూపొందించారు.
మనదేశంలో వ్యాక్సినేషన్ విషయంలో ఎంతో తప్పుడు సమాచారం ప్రచారంలో ఉందన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడానికి ఈ థీమ్ సాంగ్‌ను విడుదల చేశామన్నారు. ఈ పాటను కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా అబ్జర్వేషన్ కోసం రూపొందించామన్నారు.
Also Read: Facebook Server Down: మళ్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. ఇంతకీ ఏమైనట్టు?
Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!