AP AmitShah : 14న తిరుపతిలో అమిత్ షా, జగన్, కేసీఆర్ భేటీ ... తాజ్ హోటల్‌లో ఏర్పాట్లు !
14వ తేదీన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. అమిత్ షా అధ్యక్షతన జరగనున్న సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్‌తో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులూ హాజరవుతారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14వ తేదీన తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి తాజ్ హోటల్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి, అండమాన్‌నికోబార్, లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలు చర్చిస్తారు. సమావేశం ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారు.
Also Read : విజయగర్జనతోనే టీఆర్ఎస్ మళ్లీ ట్రాక్‌లోకి ! ఇక కేటీఆర్‌దే అసలు టాస్క్ !
నిజానికి ఈ సమావేశాన్ని మార్చిలో నిర్వహించాలని అనుకున్నారు. ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అప్పట్లో తిరుపతి ఉపఎన్నిక , ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉండటంతో సమావేశం వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ నిర్వహిస్తున్నారు. అమిత్ షాతో ఇటీవల ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించారు. ఆ భేటీలోనూ సీఎం జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే అదే రోజు జగన్ జిమ్ చేస్తూండగా కాలు బెణకడంతో ఆయన వెళ్లలేకపోయారు. ఏపీలోనే ఈ సారి సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతూండటంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు.
దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు ఏ మాత్రం ప్రోత్సాహకరంగా లేదని ఇటీవలి కాలంలో రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ పలు అంశాలపై కేంద్రంపై పోరాడదామని దక్షిణాది రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలు, కేంద్రం పెత్తనంపై చురుకుగా స్పందిస్తున్నారు. ఈ కారణంగా దక్షిణాది రాష్ట్రాల సమావేశం వాడి - వేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల మధ్య కూడా పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి. వాటిపైనా చర్చ జరగనుంది.
Also Read: "దళిత బంధు"గా కేసీఆర్‌ను దళితులు గుర్తించలేదా ? నమ్మలేకపోయారా ?
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఒక్క కర్ణాటక మాత్రమే. మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలో అధికారంలో ఉన్నాయి. అందుకే సరజన్ జోనల్ కౌన్సిల్ సమావేశం సహజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

