Kanwar Yatra: కన్వార్ యాత్ర వివాదంపై సోనూ సూద్ ట్వీట్, కౌంటర్ ఇచ్చిన కంగనా రనౌత్
Kanwar Yatra Orders: యూపీలో కన్వార్ యాత్రపై జరిగే దారిలోని దుకాణాలు కచ్చితంగా నేమ్ బోర్డ్‌లు పెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై సోనూ సూద్ ట్వీట్ చేయగా కంగనా స్పందించారు.
Kanwar Yatra Controversy: యూపీలో కన్వార్ యాత్ర (Kanwar Yatra) జరగనున్న క్రమంలో యోగి సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. యాత్ర జరగనున్న దారి పొడవునా ఉండే ఫుడ్ షాప్‌లు కచ్చితంగా నేమ్ బోర్డ్‌ని పెట్టుకోవాలని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలు వివాదాస్పదమవుతున్నాయి. బక్రీద్, రంజాన్ లాంటి పండుగలనూ ముస్లింలు, హిందువులు కలిపి జరుపుకుంటున్న సందర్భాలున్నాయని, ఇలాంటి ఆంక్షలు విధించడేమంటని కొందరు వాదిస్తున్నారు. అయితే...ఈ వివాదంపై నటుడు సోనూ సూద్ పరోక్షంగా ట్వీట్ చేశారు. ప్రతి షాప్ నేమ్ బోర్డ్‌పై "Humanity" అని మాత్రమే ఉండాలని పోస్ట్ పెట్టారు. ఎక్కడా కన్వార్ యాత్ర గురించి ప్రస్తావించకుండానే ఈ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు.
There should be only one name plate on every shop : “HUMANITY” 🇮🇳
— sonu sood (@SonuSood) July 19, 2024
కంగనా రనౌత్ కౌంటర్..
యూపీ సర్కార్‌కి వ్యతిరేకంగానే సోనూ సూద్ ఈ పోస్ట్ పెట్టారని మండి పడ్డారు. ఇక ఈ ట్వీట్‌పై సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. సోనూ సూద్‌కి సెటైర్ వేశారు. మీరు చెప్పింది నిజమే అంటూనే చురకలు అంటించారు. "మీరు చెప్పింది కచ్చితంగా నిజమే. హలాల్‌కి బదులుగా నేమ్ బోర్డ్‌లపై హ్యుమానిటీ అని రాయాలి" అని పోస్ట్ పెట్టారు.
Agree, Halal should be replaced with “ HUMANITY” https://t.co/EqbGml2Yew
— Kangana Ranaut (@KanganaTeam) July 19, 2024
జావేద్ అక్తర్ విమర్శలు..
అంతకు ముందు బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ కూడా ఈ వివాదంపై స్పందించారు. యూపీ సర్కార్‌పై తీవ్రంగా మండి పడ్డారు. ప్రభుత్వాన్ని నాజీలతో పోల్చారు. ముజఫర్‌నగర్ పోలీసులు కన్వర్ యాత్ర జరిగే దారిలో షాప్‌లన్నీ కచ్చితంగా నేమ్ బోర్డ్‌లు పెట్టుకోవాలని చెప్పడం దారుణమైన విషయమని విమర్శించారు. ఒకప్పుడు జర్మనీలో నాజీలు ఇలానే కొన్ని షాప్‌లు, ఇళ్లపైన ముద్రలు వేసేవారని సెటైర్లు వేశారు. యూపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. హలాల్ ఉత్పత్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెబుతోంది. ఆయా షాప్ ఓనర్‌లు ఐడీ కార్డులు కూడా చూపించాలని ప్రభుత్వం కండీషన్ పెట్టింది. దీనిపై బీజేపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
Muzaffarnagar UP police has given instructions that on the route of a particular religious procession in near future all the shops restaurants n even vehicles should show the name of the owner prominently and clearly . Why ? . In Nazi Germany they used to make only a mark on…
— Javed Akhtar (@Javedakhtarjadu) July 18, 2024
Also Read: Mumbai Weather: మూడు రోజులుగా భారీ వర్షాలు, కుప్ప కూలిన బిల్డింగ్ - మహిళ మృతి, 13 మందికి గాయాలు