Snowfall in Desert: దశాబ్దాల తర్వాత ఎడారిలో మంచు వర్షం, ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు
Snowfall in Desert: ఎడారి అంటే ఇసుక, వేడి ఉంటుందని మాత్రమే మనకు తెలుసు. కానీ అమెరికాలోని సోనోరన్ ఎడారిలో మాత్రం ఇటీవలే మంచు వర్షం కురించింది. ఇది శాస్త్రవేత్తల్లో కూడా ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది.
Snowfall in Desert: భూమిపై చాలా వింతలూ, విశేషాలు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోని వివిధ మూలల్లో జరిగిన వింత సంఘటనల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అలాంటిదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎడారులు అనగానే మన మదిలో మెదిలే రూపం.. ఇసుక, ఒక్క చెట్టు కూడా లేని ప్రాంతం. అసలు అలాంటి ప్రాంతాల్లో ఉన్న వేడి ఇంకెక్కడా ఉండదని భావిస్తుంటాం. కానీ అక్కడ కూడా వర్షాలు పడుతుంటాయి. ఇది కొంచెం నమ్మడానికి మామూలుగా అనిపించినా.. అక్కడ మంచు వర్షం కురుస్తుందంటే మాత్రం ఎవరూ నమ్మలేరు. కానీ ఉత్తర అమెరికాలోని ఎడారుల్లో కూడా వేసవిలో వర్షాలు కురుస్తాయి. కానీ చాలా దశాబ్దాల తర్వాత అక్కడ మంచు కురుస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. వాటిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
దశాబ్దాల తర్వాత మంచు వర్షం
ఉత్తర అమెరికాలోని సోనోరన్ ఎడారి వాయువ్య మెక్సికన్ రాష్ట్రాలైన సోనోరా, బాజా కాలిఫోర్నియా, బాజా కాలిఫోర్నియా సుర్, అలాగే నైరుతి యునైటెడ్ స్టేట్స్ కొంత భాగంలో విస్తరించి ఉంది. మెక్సికో, యునైటెడ్ స్టేట్స్ రెండింటిలోనూ ఇది హాటెస్ట్ ఎడారిగా చెబుతుంటారు. దీని వైశాల్యం 260,000 చదరపు కిలోమీటర్లు (100,000 చదరపు మైళ్ళు) ఉంటుంది. వేసవి కాలంలో ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా కనుచూపు మేర ఇసుక మాత్రమే కనిపిస్తుంది. అక్కడ నీరు లేనందున అక్కడ ఎవరూ నివసించడానికి సాహసం చేయడంలేదు.
అయితే కొద్ది రోజుల క్రితమే ఇలాంటి ఎడారిలో మంచు కురిసింది. ఈ చారిత్రక దృశ్యాన్ని ల్యాండ్‌స్కేప్ ఫోటోగ్రాఫర్ జాక్ డైకింగా కూడా తన కెమెరాలో బంధించారు. డైకింగా 1976 నుంచి సోనోరన్ ఎడారిని ఫోటో తీస్తున్నాడు. దశాబ్దాలుగా ఇక్కడ మంచు కురవడం లేదని వారు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ హిమపాతం నిజంగా కొంత మేజిక్ లాగా కనిపిస్తుంది. ఇది సామాన్య ప్రజలతో పాటు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
హిమపాతానికి కారణం ఇదే..
అమెరికాలోని నేషనల్ వెదర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లోని వాతావరణ శాస్త్రవేత్త బియాంకా ఫెల్డ్‌కిర్చెర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతోనే ఇలా మంచు కురిసిందని అంటున్నారు. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో వాతావరణం నింతరం మారుతూ ఉంటుందని చెబుతున్నారు. ఆర్కిటిక్ నుంచి దక్షిణానికి వెళ్లే గాలులు తిరిగి ఈ ప్రాంతానికి వచ్చాయట. దాని కారణంగా ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ యుఎస్‌లో భారీ హిమపాతం కురవడానికి కూడా ఇదే కారణమని తెలిపారు.
ప్రపంచంలో మంచు కురిసే ఏకైక ఎడారి
ప్రపంచంలో మంచు కురిసే ఎడారి ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ప్రత్యేకమైన ఎడారి కెనడాలోని యుకాన్ నగరంలో ఉంది. అయితే ఇందులో విశేషమేమిటంటే మీరు ఈ ఎడారిని కేవలం కొన్ని గంటల్లో దాటవచ్చు. ఎందుకంటే ఈ ఎడారి కేవలం ఒక చదరపు మైలులో మాత్రమే విస్తరించి ఉంది. ఈ ఎడారి చాలా ఎత్తులో ఉంటుంది. దీని కారణంగా శీతా కాలంలో చల్లగా ఉంటుంది.