Snooping Case: మనీశ్ సిసోడియాకు మరో షాక్ ఇచ్చిన CBI,గూఢచర్యం చేశారంటూ కేసు నమోదు
Snooping Case: ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాపై CBI గూఢచర్య కేసు నమోదు చేసింది.
Snooping Case:
ఫీడ్‌బ్యాక్ యూనిట్ దుర్వినియోగం: సీబీఐ
లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాపై గూఢచర్య కేసు పెట్టింది CBI.ఈ కేసు పెట్టేందుకు అనుమతినివ్వాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రిక్వెస్ట్ పెట్టుకోగా..అందుకు ఆ శాఖ అనుమతినిచ్చింది. అవినీతి నియంత్రణ చట్టం కింద ఈ కేసు నమోదు చేసింది. 2015లో ఆప్ అధికారంలోకి వచ్చిన తరవాత Feedback Unit (FBU)పెట్టినట్టు CBIనిర్ధరించింది. ఢిల్లీలోని విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ సిసోడియా చేతుల్లోనే ఉంది. ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆయన రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని ఇటీవలే CBI రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలన్నింటిపైనా రహస్యంగా నిఘా పెట్టారని, గూఢచర్యం చేశారని CBI తేల్చి చెప్పింది. స్వతంత్రంగా పని చేసే సంస్థలపైనా నిఘా పెట్టారని CBI చెబుతోంది. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, అందులోని ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో తెలుసుకునేందుకు 2015లో ఈ ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది ఆప్ సర్కార్. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వెంటనే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఇది ఏర్పాటైంది. ఇందుకోసం రూ.కోటి ఖర్చు చేసింది.
సిసోడియా ఫైర్..
2016 నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి. అయితే...ఈ యూటిన్‌తో అవినీతికి సంబంధించిన వ్యవహారాలపై నిఘా పెట్టడంతో పాటు రాజకీయ అవసరాలు తీర్చుకునేందుకూ ఉపయోగించారని తీవ్రంగా ఆరోపిస్తోంది CBI.రూ.36 లక్షల మేర ఇందుకోసం ఖర్చు చేసిందనీ చెబుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని ఆరోపిస్తోంది. ఆయనతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న అందరిపైనా కేసు నమోదు చేసేలా అనుమతినివ్వాలని CBI లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సక్సేనాను కోరింది. ఆయన ఆమోద ముద్ర వేసి కేంద్ర హోం శాఖకు పంపగా...అక్కడి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఫలితంగా..సిసోడియాపై స్నూపింగ్ కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. దీనిపై సిసోడియా మండి పడుతున్నారు. అత్యంత దారుణం అంటూ ట్వీట్ చేశారు.
అబద్ధపు కేసులు తనపై పెడుతున్నారంటూ విమర్శించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ఎదుగుతున్న కొద్ది తమపై ఇలాంటి కేసులూ పెరుగుతాయని అసహనం వ్యక్తం చేశారు సిసోడియా.
अपने प्रतिद्वंदियों पर झूठे केस करना एक कमज़ोर और कायर इंसान की निशानी है।
— Manish Sisodia (@msisodia) February 22, 2023
जैसे जैसे आम आदमी पार्टी बढ़ेगी, हम पर और भी बहुत केस किए जाएँगे। https://t.co/hu37UOytyt
ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియాకు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు మరోసారి CBI నుంచి పిలుపు వచ్చింది. ఈ విషయాన్ని వెల్లడించిన సిసోడియా...విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే...ఇంతలోనే విచారణకు హాజరు కాలేనని CBIకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. పోస్ట్‌పోన్ చేయాలని కోరారు. నిజానికి ఇవాళే సిసోడియా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే...ఉన్నట్టుండి ఆయన ఈ తేదీని మార్చాలని అడిగారు. సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశముందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేసే పని తుది దశకు చేరుకుందని..ఇది పూర్తయ్యాక విచారణకు హాజరవుతానని చెప్పారు. ఆర్థిక శాఖ కూడా తన పరిధిలోనే ఉందని, బడ్జెట్ తయారు చేసే పనిలో ఉన్నానని తెలిపారు.
Also Read: Emergency Landing: ఫ్లైట్ ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్,ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన పైలట్