Viral News: ప్రయాణీకుడి ఫ్యాంట్ జేబులో పాములు, షాకైన ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది
Telugu News: మియామీ విమానాశ్రయంలో తనిఖీలు చేసిన సెక్యూరిటీ సిబ్బంది షాక్ ఇచ్చాడు. ఏకంగా ప్యాంట్ జేబులోనే పాములు వేసుకొని వచ్చాడు. రెండు చిన్నపాటి పాములు గుర్తించారు.
USA News: ఫ్యాంట్ జేబులో ఎవరైనా ఫోన్, పర్సు వంటివి పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. విమానాశ్రయాలు వంటి చోట్ల తనిఖీ చేసే సెక్యూరిటీ సిబ్బందికి దాదాపుగా ఇటువంటి వస్తువులే ప్రయాణీకులు వద్ద దొరుకుతుంటాయి. కానీ, అమెరికాలోని మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న సిబ్బంది షాక్‌కు గురయ్యేలా ఒక ప్రయాణీకుడి ఫ్యాంట్ జేబులో పాములతో కూడిన సంచిని గుర్తించారు. సంచిని ఓపెన్ చేసిన సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా బయటకు వచ్చిన పాములు చూసి షాక్ తిన్నారు. గత నెల 26న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ర్టేషన్(టీఎస్‌ఏ) ఎక్స్‌లో ఈ మేరకు వివరాలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
రెండు తెల్ల పాములు గుర్తింపు
మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చెక్ పాయింట్ వద్ద ప్రయాణీకులను చెక్ చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ఒక ప్రయాణీకుడి జేబులో అనుమానాస్పదమైన బ్యాగు కనిపించింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని అతన్ని పక్కకు తీసుకెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. జేబబులో చిన్నపాటి సన్ గ్లాసెస్ బ్యాగ్‌ను బయటకు తీశారు. దాన్ని ఓపెన్ చేయగానే చిన్నపాటి తెల్లని పాములు బయటకు వచ్చాయి. ఈ పాములను చూసిన సెక్యూరిటీ సిబ్బంది షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారాన్ని అందించి ప్రయాణీకుడిని పోలీసులకు అప్పగించారు. పాములను ఫ్లోరిడా పిష్ అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కమిషన్‌కు అప్పగించినట్టు యూఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ర్టేషన్(టీఎస్‌ఏ) వెల్లడించింది. అసలు ఈ పాములను ఎందుకు తీసుకెళుతున్నట్టు, వీటితో ఏం చేయనున్నారన్న విషయాలు తెలియాల్సి ఉంది.
Also Read:భారత్ నేపాల్ మధ్య ఏంటీ సరిహద్దు వివాదం? ఆ మూడు ప్రాంతాలపై హక్కు ఎవరిది?
Also Read: భారత్ భూభాగంలోని ప్రాంతాలతో నేపాల్ కరెన్సీ నోటు, స్పందించిన జైశంకర్