Viral Video: ద్యావుడా! వాషింగ్ మెషీన్‌లో ఐదడుగుల కోబ్రా, మూత తీయగానే బుసలు - వీడియో
Viral News: రాజస్థాన్‌లోని కోటాలో ఓ ఇంట్లో వాషింగ్ మెషీన్‌లో ఐదడుగుల కోబ్రా కనిపించింది. మూత తీయగానే బుసలు కొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
Viral News in Telugu: రాజస్థాన్‌లోని కోటాలో ఓ కుటుంబానికి ఐదడుగుల కోబ్రా ముచ్చెమటలు పట్టించింది. వాషింగ్ మెషీన్‌లో బుసలు కొడుతూ చుక్కలు చూపించింది. మెషీన్‌లో బట్టలు వేద్దామని తెరిచి చూస్తే అందులో పాముని చూసి వణికిపోయారంతా. కోటాలోని వివేకానంద నగర్‌లో ఈ ఘటన జరిగింది. కోబ్రాని చూసిన వెంటనే పాములు పట్టే వాళ్లకి సమాచారం అందించారు. విషసర్పం కావడం వల్ల ఇంట్లో వాళ్లంతా హడలెత్తిపోయారు. పాముని పట్టుకునే వాళ్లు వచ్చేంత వరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. వాళ్లు వచ్చి సురక్షితంగా పాముని పట్టుకుని తీసుకెళ్లారు. వర్షాకాలం కావడం వల్ల పాములు వెచ్చదనం కోసం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఇలా దాక్కుని ఉంటాయి. ఈ ఇంట్లో పాము వాషింగ్ మెషీన్‌లో నక్కింది.
#Kota- स्वामी विवेकानंदनगर में कपड़े धोने के दौरान वाशिंग मशीन में कोबरा नज़र आने से हड़कंप मच गया.#Snake #Cobra #Washingmachine #viralvideo #Trending #trendingvideo pic.twitter.com/iI02bZXBGj
— विभोर अग्रवाल🇮🇳 (@IVibhorAggarwal) August 21, 2024
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. సరదాగా కామెంట్స్ కూడా పెడుతున్నారు. "బయట పొల్యూషన్ ఎక్కువైపోయింది. అందుకే ఇక్కడ దాక్కుంది" అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. వర్షం ఆగడం లేదని ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకుందేమో అని మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు రాజస్థాన్‌లో నీళ్ల కోసం ఎదురు చూస్తున్నట్టుంది అని సెటైర్ వేశాడు. పాముని చూడకుండానే వాషింగ్ మెషీన్ ఆన్ చేసినట్టు ఇంటి యజమాని చెప్పాడు. పాము కనిపించిన వెంటనే ఆఫ్ చేశాడు. మొత్తానికి పాముని కాపాడి లడ్‌పుర అడవిలోకి వదిలారు.
Also Read: Viral Video: నిరసనకారులపై లాఠీఛార్జ్, పనిలో పనిగా పైఅధికారికీ లాఠీ దెబ్బ వేసిన పోలీస్ - వీడియో