Smriti Irani: మోదీ చరిష్మాను దెబ్బ తీసేందుకే ఈ కుట్ర, దేశ ప్రజలంతా గమనించాలి - జార్జ్ సోరోస్‌కు స్మృతి ఇరానీ కౌంటర్
Smriti Irani - George Soros: జార్జ్ సోరోస్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు.
Smriti Irani Vs George Soros:
పార్టీలకు నిధులిస్తున్నారు: స్మృతి
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బ తీసేందుకు విదేశీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అమెరికన్ బిలయనీర్ జార్జ్ సోరోస్ ఇక్కడి పార్టీలకు ఫండింగ్ ఇచ్చి మరీ ప్రధానిని డీఫేమ్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండి పడ్డారు. అంతకు ముంది జార్జ్ సోరోస్ ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. "అదానీ అంశంతో ప్రధాని మోదీ చరిష్మాకు మచ్చ వస్తుంది. మోదీ సర్కార్ బలహీనమవుతుంది" అని అన్నారు. అంతే కాదు. దీనిపై ప్రధాని సమాధానమివ్వాలనీ డిమాండ్ చేశారు. ఈ కామెంట్స్‌కు స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. కొన్ని విదేశీ శక్తులు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసేందుకు చూస్తున్నారని మండి పడ్డారు.
"దేశ ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఇది. జార్జ్ సోరోస్ భారత దేశ ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి కుట్రల్ని తిప్పి కొట్టాం. మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన వాళ్లకు బుద్ధి చెప్పాం. ఈ సారి భారతీయులంతా ఏకమై జార్జ్ సోరోస్‌కు గట్టి బదులివ్వాలని కోరుకుంటున్నాను"
- స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
జార్జ్ సోరోస్‌ను ఎకనామిక్ వార్ క్రిమినల్‌గా అభివర్ణించిన స్మృతి ఇరానీ...ఇప్పటికే ఎన్నో దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నారంటూ విమర్శించారు.
"తనకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలనే దురుద్దేశంతో జార్జ్ సోరోస్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని మోదీ చరిష్మాను దెబ్బ తీసేందుకు ఇక్కడి పార్టీలకు బిలియన్ డాలర్ల ఫండ్స్ ఇచ్చారనటానికి ఈ కామెంట్సే నిదర్శనం. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాల అధ్యక్షులు అంగీకరించారు. వాళ్లకు భారత్ చేసిన సాయానికి బదులుగా ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా ఉంటున్నారు. కానీ కొందరు బడా వ్యాపారవేత్తలు మన దేశ ప్రజాస్వామ్యంపై దాడి చేసేందుకు ఇలా కుట్ర చేస్తున్నారు"
- స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి
Today, as a citizen, I call upon every individual and organisation- societal or political, to denounce the intentions of such individual who seeks to weaken our democratic interests.
— BJP (@BJP4India) February 17, 2023
India has defeated imperialistic designs before, and shall do so again.
- Smt. @smritiirani pic.twitter.com/sdzwn1siCw
जॉर्ज सोरोस जैसे व्यक्ति चाहते हैं कि एक कमजोर देश हो, जिसमें एक कमजोर सरकार हो और जो उनके दिशा-निर्देश अनुसार चले…लेकिन ये एक नया हिंदुस्तान है।
— BJP (@BJP4India) February 17, 2023
- श्रीमती @smritiirani pic.twitter.com/aJD1yi3pZC
ఇలాంటి కుట్రల్ని భారత్ గతంలోనే తిప్పి కొట్టిన సంగతి జార్జ్ సోరోస్ గమనించాలని హెచ్చరించారు స్మృతి ఇరానీ. ప్రజాస్వామ్యమే భాత్‌కు బలం అని, అది ఎప్పటికీ చెక్కు చెదరదని స్పష్టం చేశారు.
Also Read: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదమే కారణమా? కమిటీ ఏం చెప్పిందంటే!