By: Ram Manohar | Updated at : 23 Jul 2022 05:51 PM (IST)
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో చట్ట విరుద్ధంగా బార్ నడుపుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది
Smriti Irani Daughter Bar:
నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు: న్యాయవాది
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు గోవాలో చట్ట విరుద్ధంగా ఓ బార్‌ను నడుపుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. స్మృతి ఇరానీని వెంటనేమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ఆరోపణలను ఆమె కూతురు తరపున న్యాయవాది కొట్టిపారేశారు. కాంగ్రెస్ చెప్పిన పేరుతో గోవాలో ఎలాంటి రెస్టారెంట్ లేదని, ఆమె యజమాని కాదని స్పష్టం చేశారు. కేవలం ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించాలనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. అప్పటికే కాంగ్రెస్ నేతలు ఈ విషయమై వరుస ట్వీట్‌లు చేశారు. గోవాలో ఉన్న ఆ బార్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చిన కాపీలనూ షేర్ చేశారు. ఈ నోటీసులు ఇచ్చిన అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చి వేరే చోటకు బదిలీ చేశారనీ ఆరోపించారు. అయితే స్మృతి ఇరానీ కూతురు తరపున న్యాయవాది మాత్రం తమకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. "మా క్లైంట్‌కు 18 ఏళ్లు. ఆమె చెఫ్‌గా ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. రకరకాల రెస్టారెంట్లలో పని చేస్తోంది. ఇలాంటి ఆరోపణల వల్ల ఆమె భయాందోళనలకు గురి అవుతుంది" అని వ్యాఖ్యానించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆమెపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
They vaccinate dead people and run bars in the name of dead people.
While common man’s kids get Trishul, their kids get businesses.
Smriti Irani’s Family Restaurant in Goa in the Eye of a Storm https://t.co/soeVMVGMu4 via @thewire_in — Lavanya Ballal (@LavanyaBallal) July 22, 2022
రెండు లైసెన్స్‌లు ఉండటం విరుద్ధం: కాంగ్రెస్
2021లో మరణించిన వ్యక్తి పేరిట ఈ ఏడాది జూన్‌లో స్మృతి ఇరానీ కూతురు లైసెన్స్ పొందారని, చనిపోయిన వ్యక్తి పేరిట లైసెన్స్ ఉండటం చట్ట విరుద్ధమని కాంగ్రెస్ అంటోంది. గోవా చట్టాల ప్రకారం ఒక బార్ ఒకే లైసెన్స్ ఉండాలని, కానీ ఈ బార్‌కు రెండు లైసెన్స్‌లున్నాయని ఆరోపించింది. మీడియా వాళ్లను లోపలకు వెళ్లనివ్వకుండా బౌన్సర్లను ఏర్పాటు చేశారని విమర్శిస్తోంది. ఇందులో వాస్తవాలేంటో కచ్చితంగా బయటకు రావాలని డిమాండ్ చేస్తోంది.
Also Read: Bandla Ganesh: తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు భయ్యా- రౌడీ బాయ్ స్పీచ్ కి బండ్ల కౌంటర్
Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
Batukamma Sarees : సెప్టెంబర్ 17 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ, ఈసారి కోటికి పైగా!
రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
HORTICET - 2022: ఏపీ హార్టీసెట్ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
AP Agri Gold : ఏపీలో మళ్లీ అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం - సెప్టెంబర్ ఆరో తేదీన అసలు పోరాటం
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!