Second Hand Phone: సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా, ముందు ఇవి తెలుసుకోండి!
Second Hand Phone: మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారు.. అయితే ముందుగా ఈ పని చేయండి. అది దొంగిలించి అమ్ముతున్నారా లేదా నేరుగా వారి ఫోన్ నే ఇస్తున్నారా అనేది తెలుసుకోండి.
Second Hand Phone: డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) సంచార్ సాథీ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఫొన్ పోగొట్టుకున్న ఎవరైనా ఆ ఫోన్ ను వెంటనే బ్లాక్ చేసేయొచ్చు. అలాగే భారతదేంలో ఆ ఫోన్ ఎక్కడ ఉన్నా ట్రాక్ చేయొచ్చు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను ట్రాక్ చేయడం, బ్లాక్ చేయడంతో పాటు, సెకండ్ హ్యాండ్ పరికరాల వెరిఫికేషన్‌ను కూడా పోర్టల్ సులభతరం చేస్తుందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మీరు కొత్త స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ప్రభుత్వం ప్రారంభించిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సైబర్ మోసాలను తగ్గించే పోర్టల్
సంచార్ సాథీ పోర్టల్‌లోని మొదటి భాగం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR). మీ మొబైల్ ఫోన్ పోయినట్లయితే.. మీరు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి పోర్టల్‌ని సందర్శించవచ్చు, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బ్లాక్ చేయవచ్చు. అలాగే చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కమ్యూనికేట్ చేయవచ్చు. సంచార్ సాథీ "నో యువర్ మొబైల్" ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఇది వినియోగదారులు సెకండ్ హ్యాండ్ ఫోన్‌ని కొనుగోలు చేసే ముందు దాని ప్రామాణికతను ధృవీకరించడానికి అనుమతిస్తుంది. దీంతో పెరుగుతున్న సైబర్ మోసాల ట్రెండ్ తగ్గుతుందని వైష్ణవ్ హామీ ఇచ్చారు.
Also Read: 'సంచార్ సాథీ' పోర్టల్ తీసుకొచ్చిన కేంద్రం, ఫోన్ నేరాలు అరికట్టడమే లక్ష్యం
TAFCO సౌకర్యం అంటే ఏమిటి?
సంచార్ సాథీలో TAFCO సదుపాయం కూడా ఉంది. ఇది వ్యక్తులకు తెలియకుండా, వారి సమ్మతి లేకుండానే వారి పేరుపై మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుందో లేదో ధృవీకరించడానికి అనుమతిస్తుంది. అన్ని టెలికాం నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్‌లను ట్రేస్ చేయడానికి పోర్టల్ ఫీచర్‌లను జోడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఈఐఆర్ వెబ్ సైట్ ద్వారా ఇప్పటి వరకు చోరీకి గురైన, కనిపించకుండా పోయిన 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్లు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ తెలిపారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ చాలా ప్రయోజనకరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్ సాథీ పోర్టల్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్ లోని సీటీవో భవనంలో అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రయోజనాలు వెల్లడించారు. ఈ పోర్టల్ లోని టాప్‌కాఫ్( టీఏఎఫ్సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ సదుపాయంతో నకిలీ ఫోన్ నంబర్లను గుర్తించి వాటిని బ్లాక్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40.87 లక్షల అనుమానాస్పద కనెక్షన్ల గుర్తింపు
టాప్‌కాఫ్‌ను ఏపీఎల్ఎస్ఏ విజయవాడ బ్రాంచ్ రూపొందించిందని.. దానిని ఏడాదిన్నరగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 40.87 లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 లక్షల కనెక్షన్లను రద్దు చేసినట్లు వివరించారు.
Also Read: మొబైల్ పోగొట్టుకున్నారా? అయితే ఈ పోర్టల్‌లో ట్రాక్ చేసుకోవచ్చు