అన్వేషించండి
Advertisement
10th August 2024 News Headlines: రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం, ఇరాక్‌లో బాలికల వివాహ వయసు 9 ఏళ్లకు తగ్గించడంపై విమర్శలు వంటి మార్నింగ్ టాప్ న్యూస్
th August 2024 School News Headlines Today: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాజా వార్తల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మీ స్కూల్ అసెంబ్లీలో చదవడానికి పనికొస్తాయి
10th August 2024 School News Headlines Today:
నేటి ప్రత్యేకత:
ప్రపంచ సింహాల దినోత్సవం .
ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం
నేడు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం
డెంగ్యూ వ్యాధి నిర్మూలనా దినం.
ఒలింపిక్స్
ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్‌కు తొలి పతకం దక్కింది. కాంస్య పతక పోరులో అమన్ సెహ్రావత్ కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతక పోరులో 13-5తో అమన్ ఏకపక్ష విజయం సాధించి సత్తా చాటాడు. మ్యాట్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన అమన్.. భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు.
ఆంధ్రప్రదేశ్ వార్తలు
స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచినట్లు వెల్లడించారు. మైనర్ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25వేలు ఇస్తామన్నారు. పంద్రాగస్తు సందర్భంగా పాఠశాలల్లో డిబేట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది . 2 వేల 812 కోట్ల రూపాయల
ఉపాధి హామీ నిధులు మంజూరు చేసింది. గతంలో ఆమోదించిన 15 కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రూ.2934.80 కోట్లు మంజూరు చేసి.. విడుదల చేసిందనీ, అదనంగా ఇప్పుడు రూ.2812.98 కోట్లను విడుదల చేసిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ వార్తలు
తెలంగాణను ఇప్పటినుంచి ఫ్యూచర్ స్టేట్ అనే ట్యాగ్ లైన్‌తో పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో ఫ్యూచర్ స్టేట్‌కు తెలంగాణ పర్యాయ పదంగా నిలిచిందన్నారు. అమెరికా పర్యటనలో సీఎం పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ప్రాజెక్టుల పూడికతీతకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని.. ఇక పర్యావరణ అనుమతులు అవసరం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిందన్నారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో దారుణం జరిగింది. నాలుగు రోజుల పసికందును కుక్కలు పీక్కుతిన్నాయి. క్యాజువాలిటీ ముందు ఈ ఘటన జరిగింది. దీంతో పసిగుడ్డును కుక్కలు ఎక్కడినుంచి తీసుకువచ్చాయని అధికారులు, పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు.
జాతీయ వార్తలు
ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 8 అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.24,657 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టులు 2023-31 నాటికి పూర్తికావొచ్చని అంచనా వేస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
నీట్-పీజీ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈనెల 11న జరగనున్న ఈ పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పరీక్షను వాయిదా వేసి విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టలేమని సుప్రీం వ్యాఖ్యానించింది.
అంతర్జాతీయ వార్తలు
ఇరాక్‌లో బాలికల వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 9 ఏళ్లకు తగ్గించడంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లును ఇరాక్ న్యాయ మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టింది. బాలల వివాహ వయసును కూడా 15 ఏళ్లకు తగ్గించారు.
మంచిమాట
నువ్వు పుస్తకం ముందు తలవంచితే.. జీవితమంతా తల ఎత్తుకునే జీవిస్తావు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
కర్నూలు
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion