Savarkar Row: కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫోటో, కాంగ్రెస్ నిరసనలు
Savarkar Row: కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫోటో పెట్టడంపై కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది.
Savarkar Photo in Assembly:
అసెంబ్లీలో ఫోటో...
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేత సిద్దరామయ్యతో పాటు మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటక అసెంబ్లీలో సావర్కర్ ఫోటోను ఉంచడాన్ని వ్యతిరేకించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బీజేపీపై మండి పడ్డారు. సభ సజావుగా సాగకూడదన్న దురుద్దేశంతోనే...ఇలా సావర్కర్ ఫోటోను అసెంబ్లీలో పెట్టారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి గురించి పదేపదే ప్రశ్నిస్తున్నామన్న అక్కసుతో...ఆ అంశాన్ని దారి మళ్లించేందుకు ఇలా కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అభివృద్ధి ఎజెండా లేనేలేదని ఆరోపించారు. సిద్దరామయ్య, వాల్మీకి, బసవన్న, కనక దాస్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు...అసెంబ్లీ స్పీకర్‌కు లేఖ రాశారు. సావర్కర్ ఫోటోని అసెంబ్లీలో ఉంచడాన్ని వ్యతిరేకించారు. నిజానికి..చాలా రోజులుగా సావర్కర్‌పై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నా...ఇప్పుడు మరోసారి అసెంబ్లీ వేదికగా మొదలైంది.
ఇలా మొదలైంది..
Karnataka | LoP Siddaramaiah and other Congress MLAs protest outside the Assembly against the installation of a portrait of VD Savarkar in the Assembly hall. pic.twitter.com/rq2glzkk3F
— ANI (@ANI) December 19, 2022
They want that our Assembly proceedings should not take place. They want it disrupted. They have brought this photo because we are going to raise a lot of corruption issues against them. They don't have any development agenda: Karnataka Congress chief and MLA DK Shivakumar pic.twitter.com/jTPWpKrKjD
— ANI (@ANI) December 19, 2022
Belagavi | VD Savarkar's portrait unveiled in Karnataka Assembly hall. Congress MLAs have staged a protest with LoP Siddaramaiah writing to Speaker to install portraits of personalities like Valmiki, Basavanna, Kanaka Dasa, BR Ambedkar, Sardar Vallabhbhai Patel and many others. pic.twitter.com/Esgdl8bdgP
— ANI (@ANI) December 19, 2022
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు.
" భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు సావర్కర్ ఓ చిహ్నం. అండమాన్ జైల్లో 2-3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్.. క్షమాభిక్ష కోరుతూ బిట్రీష్ వారికి అర్జీలు పెట్టుకున్నారు. సావర్కర్ గొప్ప ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనే వేరే పేరుతో పుస్తకాలు రాశారు. బ్రిటీషర్ల నుంచి పింఛన్ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సావర్కర్ పనిచేశారు. బ్రిటీషర్లకు భయపడి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి నేతలను సావర్కర్ మోసం చేశారు. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Also Read: Elon musk Twitter Poll: ట్విట్టర్ పదవికి రాజీనామా చేయమంటారా?, మస్క్ ఓటింగ్‌లో షాకింగ్ రిజల్ట్