News
News
X

Covid C.1.2 Strain: ఇదేందిరా సామి..! మళ్లీ కొత్త వేరియంటా? వ్యాక్సిన్ కూడా పనిచేయదా?

ప్రపంచాన్ని వదిలిపోనంటున్న కరోనా.. మరో వేరియంట్ తో రానుందట. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో కరోనా తాజా వేరియంట్ ను గుర్తించారు. దీనిపై వ్యాక్సిన్ లు కూడా పనిచేయవట.

FOLLOW US: 

కరోనా.. ఈ మాట వినీవినీ మనకు బోర్ కొట్టిందేమో కానీ.. ఇది మాత్రం కొత్తకొత్త రూపాలు మారుస్తూనే ఉంది. ఉన్నవి చాలదన్నట్లు కొత్త కొత్త వేరియంట్లతో ప్రపంచాన్నే భయపెడుతోంది. కొత్తగా దక్షిణాఫ్రికా సహా మరి కొన్ని దేశాల్లో వెలుగుచూసిన సార్స్- కోవ్-2 మరింత ప్రమాదకరమని తేలింది. అయితే ఏముంది? సవాలక్ష వేరియంట్లలో ఇదీ ఒకటని లైట్ తీసుకుంటే అంతే సంగతి. ఎందుకంటే ఈ వేరియంట్ పై ప్రస్తుత వ్యాక్సిన్ లు కూడా పనిచేయట్లేదట.

Also Read: Covid 19 India Cases: దేశంలో భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు.. కరోనా థర్డ్ వేవ్‌‌కు సన్నద్ధం కావాలి.. ఆరోగ్య నిపుణులు

ఏఏ దేశాల్లో ఉందంటే..

దక్షిణాఫ్రికాకు చెందిన జాతీయ అంటువ్యాధుల సంస్థ(ఎన్ఐసీడీ), క్వాజులు-నేటల్ రీసర్చ్ ఇన్నోవేషన్స్ అండ్ సీక్వెన్సింగ్ ప్లాట్​ఫాం(క్రిస్ప్) సంస్థల శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. ఈ సీ.1.2 వైరస్ తొలుత మే నెలలో గుర్తించినట్లు వారు తెలిపారు.

News Reels

దక్షిణాఫ్రికాతో పాటు చైనా, ది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, మారిషస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్విట్జర్ లాండ్ లలో కూడా ఈ వైరస్ ను గుర్తించారు.

Also Read: KCR National Politics : జాతీయ రాజకీయాలపై కేసీఆర్ సరికొత్త వ్యూహం ! పార్టీ ఆఫీసు రెడీ అయ్యాక దూకుడే..?

మరింత శక్తిమంతంగా..

దక్షిణాఫ్రికాలో కరోనా ఫస్ట్ వేవ్​లో తీవ్ర ప్రభావం చూపించిన సీ.1 రకంతో పోలిస్తే సీ.1.2 వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉందని చెప్పారు. ఆందోళనకర వేరియంట్, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్​తో పోలిస్తే సీ.1.2లో మ్యుటేషన్లు అధికంగా ఉన్నాయని వివరించారు.

సీ.1.2 మ్యుటేషన్ రేటు 41.8 శాతం ఉందని తెలిపారు. ఇలా చూస్తే సంవత్సరానికి 41.8 సార్లు వైరస్​లో మార్పులు సంభవిస్తాయట. ప్రస్తుతం ఉన్న వైరస్ వేరియంట్ల మ్యుటేషన్ రేట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కావడం ఆందోళనకరం.

ఏదీ ఆపలేదు..

ఇప్పటికే గుర్తించిన N440K, Y449H వంటి మ్యుటేషన్లు వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీల నుంచి తప్పించుకుంటున్నట్లు తేలింది. ఇదే రీతిలో యాంటీబాడీలను తప్పించుకునే గుణం సీ.1.2 వేరియంట్ లోనూ గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంటే ప్రస్తుతం ఉన్న కరోనా వ్యాక్సిన్ లు కూడా దీనిపై పనిచేయవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Also Read: Afganisthan Crisis Update: అఫ్గానిస్థాన్ కు అమెరికా బైబై.. తాలిబన్లు జాయ్ జాయ్

Published at : 31 Aug 2021 01:01 PM (IST) Tags: covid SARS-CoV-2 C.1.2 Strain infectious

సంబంధిత కథనాలు

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

Road Accident : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు విశాఖ వాసులు మృతి

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

RBI Digital Rupee: 4 నగరాల్లో మొదలైన డిజిటల్‌ రూపాయి - హైదరాబాద్‌లో ఎప్పుడంటే?

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు

Rajasthan Crime News: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేయించిన భర్త, అనుమానం రాకుండా ప్లాన్

Rajasthan Crime News: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హత్య చేయించిన భర్త, అనుమానం రాకుండా ప్లాన్

MJPTBCWREIS: మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సు, వివరాలివే!

MJPTBCWREIS: మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సు, వివరాలివే!

టాప్ స్టోరీస్

YSRCP BC Meeting : 84 వేల మందితో జయహో బీసీ సభ - బెజవాడలో ఏర్పాట్లు ప్రారంభించిన వైఎస్ఆర్‌సీపీ !

YSRCP BC Meeting : 84 వేల మందితో జయహో బీసీ సభ - బెజవాడలో ఏర్పాట్లు ప్రారంభించిన వైఎస్ఆర్‌సీపీ !

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా

Gold Movie Review - 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా

TSRTC Shuttle Services : ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి షటిల్ సర్వీస్ బస్ లు!

TSRTC Shuttle Services : ఐటీ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, త్వరలో అందుబాటులోకి షటిల్ సర్వీస్ బస్ లు!

Mallareddy Case To ED : మల్లారెడ్డికి ఇక ఈడీ చిక్కులు కూడా - సోదాల డీటైల్స్ ఇచ్చి విచారణ చేయాలని ఐటీ సిఫారసు !

Mallareddy Case To ED :  మల్లారెడ్డికి ఇక ఈడీ చిక్కులు కూడా - సోదాల డీటైల్స్ ఇచ్చి విచారణ చేయాలని ఐటీ సిఫారసు !