మోదీ చాలా తెలివైన వ్యక్తి, ఆయన వల్లే భారత్ దూసుకుపోతోంది - పుతిన్ ప్రశంసలు
Putin Praises Modi: ప్రధాని మోదీ చాలా తెలివైన వ్యక్తి పుతిన్ ప్రశంసలు కురిపించారు.
Putin Praises Modi:
మోదీపై పుతిన్ ప్రశంసలు..
ప్రధాని నరేంద్ర మోదీపై తరచూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. గతంలో చాలా సందర్భాల్లో ఆయన లీడర్‌షిప్‌ని పొగిడారు. ఆయన తీసుకునే నిర్ణయాలూ అద్భుతం అని కితాబునిచ్చారు. ఇప్పుడు మరోసారి మోదీని ప్రశంసించారు పుతిన్. ఆయన నేతృత్వంలో భారత్ దూసుకుపోతోందని అన్నారు. అంతే కాదు. మోదీ చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. రష్యా మీడియా RT ఈ విషయాన్ని వెల్లడించింది. భారత్ అభివృద్ధి దేశంగా చాలా వేగంగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. సైబర్ క్రైమ్‌తో పాటు ఫైనాన్షియల్ సెక్యూరిటీ రంగాల్లో భారత్ రష్యా కలిసి పని చేస్తాయన్న నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు పుతిన్.
"ప్రధాని నరేంద్ర మోదీతో పొలిటికల్‌గా మాకు మంచి రాజకీయ మైత్రి ఉంది. ఆయన చాలా తెలివైన వాడు. ఆయన నేతృత్వంలోనే భారత్ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఈ అభివృద్ధి అజెండాతో భారత్, రష్యా కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉంటాయనే నమ్ముతున్నాను. రష్యా ఎప్పుడూ అందుకు అంగీకరిస్తుంది"
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
G20 డిక్లరేషన్‌పైనా సంతృప్తి..
ఇటీవల ఢిల్లీలో జరిగిన G20 సదస్సుకి పుతిన్ హాజరుకాకపోయినప్పటికీ...ఈ డిక్లరేషన్‌పై మాత్రం పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదో మైలురాయి అంటూ ప్రశంసించారు. అందులోని అంశాలన్నింటినీ రష్యా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. G20కి అధ్యక్షత వహించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని అన్నారు.
పుతిన్ ఈ మధ్యే భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలసీలను ప్రశంసించారు. పీఎం మోదీ చేస్తన్నది కరెక్ట్ అని, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడం చాలా మంచి పాలసీ అని అన్నారు. మంగళవారం రష్యాలోని వ్లాదివోస్తోక్ పట్టణంలో ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరమ్ ఎనిమిదవ సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు రష్యాలో తయారయ్యే కార్ల గురించి ప్రశ్నించగా.. ఆయన మోదీ చేపడుతున్న మేక్ ఇన్ ఇండియా పాలసీని ఉదాహరణగా తీసుకొని మాట్లాడారు. దేశీయంగా తయారుచేసిన ఆటోమొబైల్స్ వాడడం చాలా అవసరమని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఇప్పటికే ఈ విషయంలో ఉదాహరణగా నిలిచిందని పేర్కొన్నారు.
ఫోరమ్‌లో పుతిన్ ప్రసంగిస్తూ.. ' మీకు తెలుసా, ఇంతకుముందు దేశీయంగా తయారుచేసిన కార్లు లేవు. కానీ ఇప్పుడు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లు మెర్సిడెజ్, ఆడి కార్ల కన్నా మోడ్రన్‌గా కనిపించే కార్లు ఇక్కడ ఉన్నాయి. అవి 1990 ల కాలంలో అధికంగా కొనేవాళ్లం. కానీ ఇప్పుడు సమస్య ఇది కాదు. మన భాగస్వాములలో చాలా మందిని అనుకరించాలని నేను భావిస్తున్నారు. ఉదాహరణకు భారతదేశం. వారు స్వదేశంలో తయారుచేసే వాహనాల వినియోగంపై దృష్టి పెట్టారు. ప్రధాని మోదీ చేసేది కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. మేక్ ఇన్ ఇండియాను మంచిగా ప్రోత్సహిస్తున్నారు. ఆయన కరెక్ట్" అని స్పష్టం చేశారు.
Also Read: మగాడు మగాడే మహిళ మహిళే, జెండర్‌పై రిషి సునాక్ వివాదాస్పద వ్యాఖ్యలు