అన్వేషించండి

Russia Ukraine War: ఉక్రెయిన్‌కు పెరుగుతున్న సపోర్ట్, పుతిన్ ఇకనైనా తగ్గుతారా..?

Russia Ukraine War: ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది.

Russia Ukraine War:

మిలిటరీ సాయం..

రష్యా ఆక్రమణకు గురవుతున్న ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే...అగ్రరాజ్యం అమెరికా అండగా నిలవగా... ఇప్పుడు బ్రిటన్ కూడా సపోర్ట్ చేస్తోంది.  బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఉక్రెయిన్‌కు వెళ్లి మరీ "మిలిటరీ సాయం" చేస్తానని హామీ ఇచ్చారు. బ్రిటన్‌తో పాటు పలు కీలక దేశాలు ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేసేందుకు ముందుకొస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, కెనడా ఇప్పటికే...సైనిక సహకారం అందిస్తున్నాయి. ఆర్థిక సాయమూ చేస్తున్నాయి. అందరి కన్నా ముందుగా స్పందించి ఉక్రెయిన్‌కు ధైర్యమిచ్చింది మాత్రం అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైన మొదటి రోజు నుంచే...అమెరికా అన్ని విధాలా సహకరిస్తోంది. నిజానికి... అమెరికా, రష్యా మధ్య సంబంధాలు ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అండగా నిలవడానికి ఇది కూడా ఓ కారణమే. ఎన్నో సందర్భాల్లో పుతిన్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు బైడెన్. ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడారు. కొన్ని రిపోర్ట్‌లు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే...అమెరికా 1 బిలియన్ డాలర్లకుపైగా ఉక్రెయిన్‌కు సహకారం అందించేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

ఫ్రాన్స్, కెనడా కూడా..

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ కూడా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తామని ప్రకటించారు. ఫోన్‌లో చాలా సార్లు జెలెన్‌స్కీతో మాట్లాడారు కూడా. ఉక్రెయిన్‌పై చేపడుతున్న రష్యా సైనిక చర్యను"సామ్రాజ్యవాద కాంక్ష" అంటూ ఎన్నోసందర్భాల్లో మండి పడ్డారు. ఈ విషయంలో మౌనంగా ఉన్న వాళ్లు...రష్యాకు మద్దతు తెలుపుతున్నట్టే అని తేల్చి చెప్పారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన శాంతి సూత్రాలను..
ఇలాంటి యుద్ధాలు...బలహీన పరుస్తున్నాయని చెప్పారు. "ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్‌కు మిలిటరీ సాయం తప్పకుండా చేస్తుంది" అని హామీ ఇచ్చారు. కెనడా అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో అర బిలియన్ డాలర్ల నిధులను ఉక్రెయిన్‌కు అందజేస్తామని హామీ ఇచ్చారు. మిలిటరీ అసిస్టెన్స్‌కి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. "పాశ్యాత్య దేశాలు ఈ విషయంలో ఎంత బలంగా నిలబడుతున్నాయో పుతిన్ అర్థం చేసుకోవాలి" అని వ్యాఖ్యానించారు జస్టిన్ ట్రూడో. అటు జర్మనీ కూడా పెద్ద ఎత్తున ఉక్రెయిన్‌కు సైనిక సాయం అందిస్తోంది. 1000 యుద్ధ ట్యాంక్‌లు, 500 వరకూ క్షిపణులు అందించింది. నిజానికి...జర్మనీ ఇన్నాళ్లు ఓ నిబంధనను చాలా కచ్చితంగా పాటించింది. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఏ దేశానికీ ఆయుధాలు ఎగుమతి చేయకూడదని నిర్ణయించుకుంది. కానీ...ఉక్రెయిన్ విషయంలో మాత్రం ఆ లెక్కలన్నీ పక్కన పెట్టేసింది. "ఉక్రెయిన్‌కు మద్దతునివ్వడం మా కనీస  బాధ్యత" అని జర్మనీ వైస్‌ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్ వెల్లడించారు. 

రష్యాపై ఆస్ట్రేలియా గుర్రు..

రష్యా అధ్యక్షుడు పుతిన్ తీరుపై గుర్రుగా ఉంది ఆస్ట్రేలియా. పుతిన్ పదేపదే అణు బాంబుల బెదిరింపులు చేయడంపైనా మండి పడుతోంది. "ఇలాంటి హెచ్చరికలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావు. ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదు. రష్యా భూభాగాలు కాపాడుకోటానికే ఈ సైనిక చర్య అని చెప్పే మాటల్లో నిజం లేదు" అని అసహనం వ్యక్తం చేసింది ఆస్ట్రేలియా. 

Also Read: Trump Twitter Account: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్! ఇక ట్విట్టర్‌ మోత మోగిపోద్ది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma test Retirement | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యంతో రోహిత్ మనస్తాపం | ABP DesamGautam Gambhir Coaching Controversy | గంభీర్ కోచింగ్ పై బీసీసీఐ అసంతృప్తి | ABP DesamSS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desamతప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu : పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
పాలనలో 2025 గేమ్‌ ఛేంజర్‌ కావాలి- రాత్రి పగలు కష్టపడొద్దని అధికారులకు చెబుతున్న చంద్రబాబు
Tiger Attack News: కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
కొమ్రంభీమ్ జిల్లాలో భయపెట్టిన మగ పులిని బంధించిన అధికారులు
Maoists News: మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి షాక్- దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ సహా 11 మంది లొంగుబాటు
New Year 2025: ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
ధనుష్ 'ఇడ్లీ కడాయ్' ఫస్ట్ లుక్ to సూర్య 'రెట్రో' స్పెషల్ పోస్టర్ - కోలీవుడ్ న్యూ ఇయర్ అప్డేట్స్ & స్పెషల్ పోస్టర్స్
Telangana News: హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
హాస్టల్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం 
Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు
New Year 2025: క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
క్రేజీ అప్డేట్స్, కిర్రాక్ పోస్టర్స్‌... టాలీవుడ్‌లో న్యూ ఇయర్ స్పెషల్స్ ఏమిటో తెల్సా?
US Terror Attack: న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు -  12 మంది మృతి
న్యూ ఇయర్ వేడుకల్లో ఉగ్రదాడి- జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు - 12 మంది మృతి
Embed widget