అన్వేషించండి

KRMB GRMB Gazette Notification: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల సూచన... హాజరు కాని తెలంగాణ

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు కార్యాచరణకు శ్రీకారం చుడదామని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సూచించగా, అందులో కొన్ని సవరణలు చేయాల్సి ఉందని, అవి జరిగాక ముందడుగు వేద్దామని ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయపడింది.

బోర్డుల పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించడంతో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు కృష్ణా, గోదావరి బోర్డులు నిర్వహించిన సమన్వయ కమిటీల సమావేశానికి తెలంగాణ నుంచి ప్రతినిధి హాజరుకాలేదు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు... నిర్ణీత గడువులోగా సిబ్బంది, ప్రాజెక్టుల వివరాలు, నిధులు, కేంద్ర బలగాల నియామకం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు అందజేయాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ సమావేశంలో కోరాయి. అయితే నోటిఫికేషన్‌లోని రెండో షెడ్యూలులోని ప్రాజెక్టులపై కొన్ని అభ్యంతరాలున్నాయని,  ఇందుకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాస్తామని ఆంధ్రప్రదేశ్‌ సమాధానమిచ్చింది. ఏయే అంశాల్లో, ప్రాజెక్టుల్లో మార్పులు చేయాలని కోరుకుంటున్నారని బోర్డు అధికారులు ప్రశ్నించగా, వివరాలను ప్రస్తుతం చెప్పలేమని, ఉన్నతాధికారులు, న్యాయబృందం, ముఖ్యమంత్రితో చర్చించాకే కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాస్తామని తెలిపారు. అయితే సమన్వయ కమిటీ సమావేశం కంటే ముందు పూర్తి స్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణాబోర్డుని  తెలంగాణ లేఖ రాసింది. స్పందించిన బోర్డు  సమన్వయ కమిటీ సమావేశం తర్వాత  నిర్వహిస్తామని సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ నుంచి ఎవరూ హాజరుకాలేదు.


KRMB GRMB Gazette Notification: గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డుల సూచన... హాజరు కాని తెలంగాణ

బోర్డు కార్యాలయాలతోపాటు తెలంగాణ నీటిపారుదల, పరిపాలనా విభాగం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ల కార్యాలయాలు కూడా జలసౌధ భవనంలోనే ఉన్నాయి. చివరికి రెండు బోర్డులు ఆంధ్రప్రదేశ్‌ అధికారులతోనే చర్చించాయి. ఆగస్టు 15లోగా ప్రాజెక్టుల వారీగా సిబ్బందికి సంబంధించిన వివరాలు అందజేయాలని, నెలలోగా ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌మనీ డిపాజిట్‌ చేయడం గురించి  నిర్ణయం చెప్పాలని బోర్డు అధికారులు కోరారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ను తాము స్వాగతించినా కొన్ని మార్పులు చేయాలని కోరనున్నామని,  ఇవి జరిగిన తర్వాత కార్యాచరణపై ముందుకు వెళ్దామని ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది.

సవరణలు వచ్చే వరకు ప్రస్తుత గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలులో ఉన్నట్లే కనుక, అప్పటివరకు దీని ప్రకారమే ముందుకెళ్దామని బోర్డు అధికారులు సూచించారు. అయితే ‘బోర్డుల పరిధి గెజిట్‌ నోటిఫికేషన్‌ కోసం ఏడేళ్లు ఎదురుచూశాం, ఇందులో కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి సవరణలు చేయాల్సి ఉంది, ఇది జరిగాక పూర్తి స్థాయిలో అమలు చేస్తే సరిపోతుంది’ అని ఏపీ చెప్పినట్లు సమాచారం. సమన్వయ కమిటీకి ఆంధ్రప్రదేశ్‌ తరఫున నోడల్‌ అధికారిగా ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డిని నియమిస్తున్నట్లు రెండు బోర్డులకు సమాచారమిచ్చింది.

ప్రభుత్వంతో చర్చించి నిర్ణయానికి అనుగుణంగా బోర్డులు కోరిన సమాచారం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఇ.ఎన్‌.సి.) నారాయణరెడ్డి తెలిపారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లో కొన్ని అంశాల్లో అభ్యంతరాలున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పామన్నారు. తెలంగాణ నుంచి సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో తెలియదని, తాము మాత్రం నిబంధనలు, నియమాలను గౌరవిస్తామని తెలిపారు. గోదావరిలో ఎలాంటి సమస్యలు లేవు కదా బోర్డు పరిధిలోకి ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందన్నారు.

2004లో వాప్కోస్‌ అధ్యయనం ప్రకారం గోదావరిలో 1430 టీఎంసీల నీటి లభ్యత ఉంటే , వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కింద తెలంగాణలో 1355 టీఎంసీల నీటి వినియోగం జరగనుందన్నారు. దీనివల్ల దిగువన ఉన్న గోదావరి డెల్టా, పోలవరం లాంటి ప్రాజెక్టులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. అందరూ వాడుకోగా మిగిలినవే దిగువకు వస్తాయని, సముద్రానికి పోయే నీటిని తాము మళ్లించుకోవడం తప్పుకాదు కదా? అని ప్రశ్నించారు. సముద్రంలోకి పోయినా ఫర్వాలేదు, పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకోవద్దని తెలంగాణ అంటోందన్నారు. గోదావరి నుంచి మళ్లించే 45 టీఎంసీలలో తెలంగాణ వాటా గురించి ప్రశ్నించగా, తెలంగాణ కూడా గోదావరి నుంచి కృష్ణాలోకి 212 టీఎంసీలు మళ్లిస్తోందన్నారు. 

ఈ సమావేశంలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి బి.పి.పాండే, సభ్యులు కుట్యాల, వెంకటసుబ్బయ్య, కృష్ణా నదీ యాజమాన్యబోర్డు కార్యదర్శి డి.ఎం.రాయిపురే, సభ్యులు ఎల్‌.బి.ముతుంగ్‌, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి, పరిపాలనా విభాగం ఇ.ఎన్‌.సి. సతీష్‌కుమార్‌, జెన్‌కో ఎండీ శ్రీధర్‌, అంతర్‌ రాష్ట్ర జలవనరుల విభాగం ప్రత్యేక అధికారి వీరశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
Rahul Gandhi Latest News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో విద్యావ్యవస్థ" లోక్‌సభలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget