అన్వేషించండి

Revanth Reddy: దావోస్‌లో నేడు దిగ్గజ కంపెనీల సీఈవోలతో రేవంత్‌రెడ్డి భేటీ- ఐటీ, డేటాసెంటర్లు పెట్టుబడుల కోసం చర్చలు

Revanth Davos Tour: దావోస్‌లో జరుగుతున్న పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం హాజరైంది. రెండోరోజు భారీ సంస్థల సీఈవోలతో భేటీకానుంది. సదస్సులు, సమావేశాల్లో పాల్గొననుంది.

World Economic Form: స్విట్లర్లాండ్‌లోని దావోస్‌(Davos)లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55 వ వార్షికోత్సవ సదస్సుకు విశేష స్పందన లభించింది. తొలిరోజు సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు తరలివచ్చారు. వారిని ఆకర్షించేందుకు దేశాల ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు తరలివచ్చారు. మూడురోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఈసారి ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటిలిజెంట్ ఏజ్' అనే థీమ్‌ను వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (World Economic Form)ఎంచుకుంది. శాస్త్ర సాంకేతిక ఆధునాతన పరిజ్ఞానానకిి అనుగుణంగా  పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో  రౌండ్‌టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తోంది.
  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,రాష్ట్రాల ప్రతినిధులతోపాటు పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు 3 వేల మంది ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. తొలిరోజు సమావేశానికి హాజరైన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు  రెండోరోజు కూడా వివిధ సదస్సులు, సమావేశాల్లో పాల్గొననున్నారు. 

ప్రోత్సహకాలపై ప్రముఖ కంపెనీలు ఆసక్తి
 
 తెలంగాణ(Telangana)లో ఇటీవలే అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ,పునరుత్పాదక ఇంధనంం, పంప్డ్‌స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి  రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ అందిస్తున్న ప్రోత్సహకాలపై ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సాయం, రాయితీలపై బేరీజు వేసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.అలా ముందుకు వచ్చిన ఆయా సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరుపుతోంది. ఇంధన ఉత్పత్తితోపాటు  హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న  ఫోర్త్‌సిటి, ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణపై వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అత్యాధునిక డేటా సెంటర్ల  ఏర్పాటుకు  పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి. రెండోరోజు పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం సమావేశం కానుంది. అమెజాన్‌, యూనీలివర్‌, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, సిఫీ టెక్నాలజీస్‌ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

పారిశ్రామికవేత్తలతో రేవంత్‌రెడ్డి సమావేశం

  సీఐఐ(CII) సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంకానున్నారు. ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి బృందం ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం రూ. 40,232 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. మొత్తం 14 సంస్థలు ముందుకురాగా...18 ప్రాజెక్ట్‌లకు ఒప్పందాలు జరిగాయి. వాటిల్లోఇప్పటికే 17 ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి.  ఆకర్షించగా...ఈసారి అంతకన్నా ఎక్కువే  పెట్టుబడులు  వస్తాయని భావిస్తున్నారు. ఫోర్త్‌సిటీపై ప్రత్యేకంగా దృష్టిసారిచిన సీఎం రేవంత్‌రెడ్డి...అక్కడికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Champs RCB: ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న్ ఆర్సీబీ
ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న్ ఆర్సీబీ
IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే
IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే
Bhuvneshwar Kumar Record: ఐపీఎల్ 2026 ఫైనల్ లో భువనేశ్వర్ సంచలనం: షమీ పవర్ ప్లే రికార్డ్ సమం.. 
ఐపీఎల్ 2026 ఫైనల్ లో భువనేశ్వర్ సంచలనం: షమీ పవర్ ప్లే రికార్డ్ సమం.. 

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget