Republic Day Parade: రిపబ్లిక్ డే పరేడ్ చూడటానికి వెళ్తున్నారా.. ఈ వస్తువులు అస్సలు తీసుకెళ్లకూడదట - ఫుల్ లిస్ట్ ఇదే
Republic Day Parade: రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా భద్రత కోసం పలు మార్గదర్శకాలను జారీ చేశారు. టిక్కెట్‌తో పాటు, సందర్శకులు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తీసుకెళ్లడం తప్పనిసరి చేశారు.

Republic Day Parade: దేశ రాజధానిలో అతిపెద్ద వేడుక రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఇందులో అందర్నీ ఆకట్టుకునేది పరేడ్. దీన్ని చూసేందుకు చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. అయితే మీరు కూడా ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ చూడటానికి బుక్ చేసుకున్నారా.. మీరు మీ కుటుంబం గానీ, స్నేహితులతో కవాతును చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారా? అలాంటి వారి కోసం కేంద్రం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పరేడ్ ప్రాంతంలోకి పలు వస్తువులను తీసుకురాకూడదని ఆదేశించింది. లేదంటే ఇబ్బందుల్లో పడక తప్పదని హెచ్చరించింది.
రిపబ్లిక్ డే పరేడ్ లేదా బీటింగ్ రిట్రీట్ ను చూసేందుకు తప్పనిసరిగా టికెట్ ఉండాలి. ఇది లేకుండా మీరు ఈ వేడుకకు హాజరు కాలేరు. ఈ ఏడాది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సబ్యాంటో కవాతుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీంతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రిత్వ శాఖ పలు మార్గదర్శకాలను ప్రకటించింది. టిక్కెట్‌తో పాటు, సందర్శకులు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తీసుకెళ్లడం తప్పనిసరి చేసింది. ఆ తర్వాతే ప్రవేశానికి అనుమతి ఉంటుందని చెప్పింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిషేధించిన ఈ వస్తువులు ఇవే
- మండే పదార్థాలు
- ఆయుధాలు - కత్తులు, బ్లేడ్స్, తుపాకులు వంటివి
- రేడియో, ట్రాన్సిస్టర్, టేపర్‌కార్డర్, పేజర్
- ఆహార పదార్థాలు
- సిగరెట్, బీడీ, లైటర్
- సంచులు, బ్రీఫ్కేస్
- రేజర్, కత్తెర, గొడుగు
- కెమెరా, బైనాక్యులర్స్, హ్యాండ్‌క్యామ్
డిజిటల్ డైరీ, పామ్ టాప్ కంప్యూటర్, పవర్ బ్యాంక్, మొబైల్ ఛార్జర్, హెడ్ ఫోన్ - రిమోట్ కంట్రోల్ కారు, థర్మోస్ ఫ్లాస్క్, వాటర్ బాటిల్
- ఆల్కహాల్, పెర్ఫ్యూమ్ లేదా స్ప్రేలు
ప్రోటోకాల్ పై ఆదేశాలు - మెట్రో నిబంధనల్లో మార్పులు
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అనేక ప్రోటోకాల్స్ ను అమలుపర్చనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా వీటిని పాటించాల్సి ఉంటుంది. పరేడ్ సమయంలో అనుమతి లేకుండా ఫొటోలు, వీడియోలు తీయడంపైనా నిషేధం ప్రకటించారు. పలు కార్యక్రమాల్లో దీనికి సంబంధించి కఠిన నిబంధనలు విధించారు. మరోపక్క రిపబ్లిక్ డే సందర్భంగా మెట్రో రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. సాధారణ రోజుల్లో అయితే మెట్రో ఉదయం 6 గంటల నుంచి నడుస్తుంది. కానీ గణతంత్ర దినోత్సవం నాడు మాత్రం ఉదయం 4 గంటల నుంచే మెట్రోలో ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వేదిక వద్దకు చేరుకోవడానికి, మీరు మెట్రో ద్వారా నేరుగా మండి హౌస్ లేదా సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్‌కు వెళ్లొచ్చు. ఇదే సమయంలో కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ కోసం రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి.
#WATCH | A full dress rehearsal of the Republic Day parade was held at Kartavya Path in Delhi today pic.twitter.com/icYMNWgEIp
— ANI (@ANI) January 23, 2025
Also Read : Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!





















