Credit Card : క్రెడిట్ కార్డ్ డీటైల్స్ పబ్లిక్‌లో పెట్టి షాపింగ్ చేసుకోమన్నాడు - ఓటీపీ కూడా చెబుతున్నాడు - ఇవిగో డీటైల్స్
Bold Care co-founder : ఎవరైనా క్రెడిట్ కార్డు డీటైల్స్ లో నాలుగు నెంబర్లు చెప్పడానికి కూడా భయపడతారు. కానీ అతను మాత్రం డీటైల్స్ మొత్తం పెట్టాడు. ఓటీపీ వస్తే అది కూడా చెప్పాడు. ఇదంతా ఎందుకు చేశాడు ?
Bold Care co-founder shares credit card details online covers hundreds of transactions : రాహుల్ క్రిష్ణన్ అనే వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్‌లో తన క్రెడిట్ కార్డు డీటైల్స్ షేర్ చేశాడు. అందులో పూర్తి క్రెడిట్ కార్డు నెంబర్, ఎక్స్ పైరీ డేట్ అలాగే.. సీక్రెట్ నెంబర్ కూడా ఇచ్చాడు. వాటితోనే ట్రాన్సాక్షన్ పూర్తి కాదు. ఓటీపీ కూడా వస్తుంది. అది ఆ క్రిష్ణన్ నెంబర్ కే వెళ్తుంది. అది కూడా చెబుతానని ఆఫర్ ఇచ్చాడు. చెప్పాడు కూడా. అలా వందల మంది ఆయన క్రెడిట్ కార్డును వాడేసుకున్నారు. అయితే ఒక్కొక్కరికి రూ. వెయ్యి మాత్రమే లిమిట్ పెట్టాడు. కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ అయ్యాక అతని క్రెడిట్ కార్డును బ్యాంక్ బ్లాక్ చేసింది. అన్ని లావాదేవీలు జరిగితే ఏ బ్యాంక్ అయినా అదే పని చేస్తుంది.
30 మంది అధికారులను ఉరి తీసిన కిమ్, సరిగ్గా పని చేయలేదని ఈ శిక్ష
మరోసారి ఎప్పుడైనా క్రిష్ణన్ ఇలాంటి ఆఫర్ ఇస్తారేమో అని ట్విట్టర్ లో ఫాలోయర్లు పెరిగిపోయారు. ఇంతకీ ఈ పని రాహుల్ క్రిష్ణన్ ఎందుకు చేశాడు.. అతనికి డబ్బులు ఎక్కువయ్యాయా అంటే.. తెలివితేటలు ఎక్కువయ్యాయని చెప్పుకోవాలి. ఆయనకు బోల్డ్ కేర్ అనే స్టార్టప్ ఉంది. ఇది పురుషుల సెక్సువల్ హెల్త్ కు సంబందించిన ఉత్పత్తులు.. శృంగార సామర్థ్యాన్ని పెంచే ఉత్పత్తులు ..అ రకానికి చెందిన వస్తువులు అమ్మే స్టార్టప్. ఇందులో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా భాగస్వామి. అయితే మాత్రం క్రెడిట్ కార్డు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. కానీ..పబ్లిసిటీ కావాలి..అందు కోసం.. ఓ రెండు,మూడు లక్షలు ఖర్చు చేయాలనుకున్నాడు.
my card number is 4216-8701-5010-2349
— Rahul Krishnan (@oneandonlyrk) September 2, 2024
the expiration date is 12/30
the security code is 207
happy sextember everyone! 🥳🥳
కానీ ఆ రెండు, మూడు లక్షలతో ఫేస్ బుక్ లేదా ట్విట్టర్‌లో యాడ్స్ ఇస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే వైడ్ కవరేజీ రావాలంటే వైల్డ్ ఆలోచన చేయాలనుకున్నారు. అంతే తన క్రెడిట్ కార్డు డీటైల్స్ పెట్టేసి.. సినిమా ప్రారంభించారు. క్రెడిట్ కార్డు బ్లాకయ్యే సరికి ఆయనకు మహా అయితే రెండు లక్షలు ఖర్చు అయింది. కానీ కోట్లు పెట్టినా రానంత పబ్లిసిటీ వచ్చేసింది. ఆయన గురించి దేశమంతా చర్చించుకుంటోంది. ఆయన కంపెనీ గురించి కూడా చెప్పుకుంటోంది. మీడియా కూడా విస్తృత కవరేజీ ఇచ్చింది.
రోడ్ సైడ్ చాయ్ వాలా - స్టైలింగ్‌తోనే సూపర్ స్టార్ అయ్యాడు - ఇప్పుడెంత సంపాదిస్తాడో తెలుసా ?
సాధారణంగా బోల్డ్ కేర్ ప్రొడక్ఠ్స్ గురించి బయట తెలిసింది తక్కువ. కానీ రాహుల్ క్రిష్టన్ సోషల్ మీడియాలో వైరల్ చేసిన కారణంగా.. అతి తక్కువ ఖర్చుతో కంపెనీని యూత్ అందరి దృష్టిలోకి తీసుకెళ్లాడు.ఆయన వ్యాపారం పెరగడానికి ఇక ఎంతో శ్రమించాల్సిన అవసరం లేదని చెప్పాల్సిన పని లేదు. అంతా ఐడియా మహత్మ్యం.