అన్వేషించండి

Ramdev Statement: ముస్లింలందరూ ఉగ్రవాదులే, బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు - వివరణ ఇచ్చిన యోగా గురు

Ramdev Statement: ముస్లింలపై రాం దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Ramdev Statement on Muslims: 

ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు..

యోగా గురు రామ్‌ దేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ముస్లింలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు, రేపిస్ట్‌లు అంటూ నోరు జారారు. అప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీన బర్మేర్ జిల్లాలో జరిగిన ఓ ఈవెంట్‌లో ముస్లింలు, క్రిస్టయన్లను ఉద్దేశిస్తూ మాట్లాడారు 
రాం దేవ్ బాబా. 

"ముస్లింలు తప్పనిసరిగా ఉదయం ప్రార్థనలు చేస్తారు. రోజుకు ఐదు సార్లు నమాజ్ చేయాలంతే. ఆ తరవాత ఏమైనా చేసుకోవచ్చు. హిందూ అమ్మాయిలను పరిచయం చేసుకుని ఎన్ని పాపాలైనా చేయొచ్చు. చాలా మంది ముస్లింలు ఇదే చేస్తారు. కానీ నమాజ్‌ను మాత్రం కొనసాగిస్తారు. టెర్రరిస్ట్‌లు, క్రిమినల్స్‌లా కనిపించే వీళ్లు నమాజ్‌తో వాటిని కవర్ చేస్తారు. ఇస్లాం అంటే నమాజ్ చేయడం అని మాత్రమే వాళ్లకు తెలుసు. కానీ హిందూ మతం అలా కాదు" 
- బాబా రాం దేవ్, యోగా గురు 

ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాందేవ్ బాబా వివరణ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా ఓ వర్గానికి చెందిన వాళ్లు గురించి ఈ వ్యాఖ్యలు చేయలేదని, ప్రతి మతంలోనూ అలాంటి వాళ్లుంటారని మాత్రమే చెప్పానని స్పష్టతనిచ్చారు. ఈ కామెంట్స్ తప్పా ఒప్పా అన్నది ఎవరికి వాళ్లు ఆలోచించుకోవాలని తెలిపారు. 

అంతకు ముందు మహిళలపై చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపాయి. దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు స్పందించిన బాబా.. తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేసినట్లు మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైరపర్సన్‌ రూపాలీ చకాంకర్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ఈ క్షమాపణ లేఖను కూడా పోస్ట్ చేశారు. "మహిళలు చీరలు కట్టుకున్నా అందంగా ఉంటారు. సల్వార్ వేసుకున్నా బాగానే కనిపిస్తారు. నా కళ్లకైతే...వాళ్లు ఏమీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు" అని అన్నారు. ఈ కామెంట్స్ చేసిన సమయంలో వేదికపై మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సతీమణి అమృత ఫడణవీస్ కూడా ఉన్నారు. రామ్ దేవ్ బాబా వ్యాఖ్యలతో షాక్ అయిన ఆమె...ఆ అసహనాన్ని బయట పెట్టకుండా అలా నవ్వుతూ ఊరుకున్నారు.

" మహిళలు ఈ సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందాలనే ఉద్దేశంతో వారి సాధికారత కోసమే నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'బేటీ బచావో - బేటీ పడావో' కార్యక్రమాలను నేను ప్రోత్సహిస్తున్నాను. మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదు. అయినప్పటికీ.. ఎవరైనా బాధపడినట్లయితే నేను తీవ్రంగా చింతిస్తున్నా. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాను.             "

- బాబా రాందేవ్‌, యోగా గురువు
 
Also Read: Twitter CEO: ట్విటర్‌ సీఈవో మారిపోయారు, కొత్త బాస్ ఎవరో చెప్పిన మస్క్
 
" target="_blank">
Twitter CEO: ట్విటర్‌ సీఈవో మారిపోయారు, కొత్త బాస్ ఎవరో చెప్పిన మస్క్
 
 

టాప్ హెడ్ లైన్స్

Rohit Virat WorldCup: రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందేనని బోర్డు కీలక నిర్ణయం
రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్.. 2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే వాళ్లిద్దరూ ఉండాల్సిందేనని బోర్డు కీలక నిర్ణయం
Rishabh Pant Sixes:  దిగ్గజం మెకల్లమ్  రికార్డును బద్దలు కొట్టిన పంత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు, గిల్‌క్రిస్ట్ సరసన ..
దిగ్గజం మెకల్లమ్  రికార్డును బద్దలు కొట్టిన పంత్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా రికార్డు, గిల్‌క్రిస్ట్ సరసన నిలిచిన టీమిండియా కీపర్
Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు.. మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు, 90 సీట్లు.. మళ్లీ అధికారంలోకి కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
ITI vs IIT Respect: ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్
ఐఐటీ గ్రాడ్యుయేట్లతో సమానంగా ఐటీఐ విద్యార్థులకు గౌరవం.. ప్రధాని మోదీ విజన్‌ను స్వాగతించిన మంత్రి లోకేశ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget