By: Ram Manohar | Updated at : 05 Mar 2023 04:31 PM (IST)
మార్చి 6న సముద్ర జలాలపై త్రివిధ దళాధిపతులు సమావేశం కానున్నారు.
Naval Commanders' Conference:
రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో
మార్చి 6 వ తేదీన త్రివిధ దళాధిపతులు సమావేశం కానున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో INS విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌లో నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ జరగనుంది. రక్షణ పరంగా అనుసరించాల్సిన వ్యూహాత్మక విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీనియర్ అధికారులంతా ఈ భేటీలో పాల్గొనున్నారు. సముద్ర జలాలపై జరుగుతున్న తొలి సమావేశం ఇదే. అది కూడా దేశీయంగా తయారైన INS విక్రాంత్‌పై జరుగుతుండటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
"తొలిసారి కమాండర్స్ కాన్ఫరెన్స్ సముద్ర జలాలపై జరుగుతోంది. మరో విశేషం ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన INS విక్రాంత్‌లో సమావేశం జరగనుంది"
- రక్షణ శాఖ
Raksha Mantri Shri Rajnath Singh is scheduled to reach Goa on 6th March, to attend the Naval Commanders' Conference.
— Defence PRO Visakhapatnam (@PRO_Vizag) March 5, 2023
The Raksha Mantri will address the Naval Commanders onboard India’s first indigenous aircraft carrier, @IN_R11Vikrant.
https://t.co/7Ndc6mpesL pic.twitter.com/7GZBmtADwn
Rajnath Singh to address Naval Commanders conference onboard INS Vikrant on March 6
— ANI Digital (@ani_digital) March 5, 2023
Read @ANI Story | https://t.co/Eo9IhuSGza#RajnathSingh #NavalCommandersConference #insvikrant pic.twitter.com/VpDdWfCeQQ
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో పాటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. నావల్ కమాండర్స్‌తో కీలక అంశాలపై చర్చించనున్నారు. చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ సహా ఇతర నావల్ కమాండర్‌లు పలు విషయాలపై రివ్యూ చేయనున్నారు. ఆపరేషనల్, మెటీరియల్, లాజిస్టిక్స్, హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్ సహా ట్రైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల్లో పురోగతిపై చర్చలు జరపనున్నారు. గత ఆర్నెల్లలో ఈ విభాగాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చర్చించడంతో పాటు భవిష్యత్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తారు. ఇదే సమావేశంలో అగ్నిపథ్ పథకంపైనా చర్చలు జరగనున్నాయి.
Also Read: Tamil Nadu: వలస కూలీలకు అండగా ఉంటాం, ఎవరూ భయపడాల్సిన పని లేదు - తమిళనాడు సీఎం స్టాలిన్
Chaitra Navratri 2023: 100 మందిని సన్యాసులుగా మార్చేయనున్న రామ్‌దేవ్ బాబా, ముహూర్తం కూడా పెట్టేశారు
Breaking News Live Telugu Updates: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న సీఎం జగన్
QR code on Tombstone: కుమారుడి సమాధిపై క్యూఆర్ కోడ్, జ్ఞాపకాలను సజీవంగా దాచిన కుటుంబం
New Contraceptive Tool: గర్భనిరోధకానికి కొత్త సాధనం - తెలుగు రాష్ట్రాల్లో అమలుకు ప్రయత్నాలు
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
NTR 30 Muhurtham : మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు