By: Ram Manohar | Updated at : 05 Mar 2023 03:40 PM (IST)
తమిళనాడులో ఉత్తరాది కూలీలపై దాడులు జరుగుతున్నట్టు వీడియోల సర్క్యులేట్ అవుతున్నాయి.
Migrant Workers in Tamil Nadu:
ఉత్తరాది కూలీలపై దాడులు..?
తమిళనాడులో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్చే కూలీలపై దాడులు జరుగుతున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఇదంతా ఫేక్ అని పోలీసులు చెబుతుంటే..దాడులు జరుగుతున్నాయంటూ మరి కొందరు వాదిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేసుకుంటున్న వలసకూలీలు భయభ్రాంతులకు లోనవటంతో తమిళనాడు పోలీసులు, ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ వివాదంపై స్పందించారు. వలస కూలీలను రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
"వలస కూలీలు భయపడాల్సిన పని లేదు. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. తమిళనాడు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది"
-స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి
Bihar Association in Tamil Nadu holds a meeting with migrant workers who are working in Chennai, amid rumours of alleged attacks pic.twitter.com/gTPoaMJgTo
— ANI (@ANI) March 5, 2023
Bihar government is serious in this matter. Hence, a team has been sent to Tamil Nadu. Both Bihar & TN governments will not tolerate this (alleged attacks on migrants): Bihar Deputy CM Tejashwi Yadav pic.twitter.com/zuhNqPsDGh
— ANI (@ANI) March 5, 2023
రెండు రాష్ట్రాలు అలెర్ట్..
తమిళనాడు, బిహార్ ప్రభుత్వాలు ఇప్పటికే వేరువేరు ప్రకటనలు చేశాయి. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఇలాంటి వీడియోల కారణంగా కార్మికులందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నాయి. అటు బిహార్ అసెంబ్లీలోనూ ఈ వివాదంపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. తమ రాష్ట్రానికి చెందిన కార్మికులను ప్రత్యేకంగా కలిసి మాట్లాడతామని బిహార్ అధికారులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల పోలీసులు సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వాట్సాప్‌లోనూ పెద్ద ఎత్తున వీడియోలు, మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతుండటాన్ని గమనించారు. జిల్లా కలెక్టర్‌లు కూడా కార్మికులకు భరోసా ఇచ్చారు. భయపడాల్సిన పని లేదని చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు ఈ వివాదంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలని బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. అయితే తమిళనాడు పోలీసులు మాత్రం ఈ వీడియోలన్నీ ఫేక్ అని తేల్చి చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలు సృష్టిస్తున్నారని అన్నారు.
Tamil Nadu | Police and Tiruppur administration conduct a meeting with representatives of business and industry associations and migrant workers over the issue of alleged attacks on migrants pic.twitter.com/Ky95VcuIFG
— ANI (@ANI) March 5, 2023
Also Read: Electric Vehicles Exemption: ఈవీలు కొనే వారికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ప్రభుత్వం, ట్యాక్స్ కట్టక్కర్లేదట
Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే
Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్ రేట్లతో జనం పరేషాన్, తిరుపతిలో భారీగా జంప్
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా
ABP Desam Top 10, 26 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!