![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rajasthan CM Health: ఆసుపత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ అనారోగ్యం పాలయ్యారు. ప్రస్తుతం జైపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
![Rajasthan CM Health: ఆసుపత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్ Rajasthan CM Ashok Gehlot undergoes Angioplasty SMS Hospital Jaipur post covid complications Rajasthan CM Health: ఆసుపత్రిలో చేరిన రాజస్థాన్ సీఎం.. త్వరగా కోలుకోవాలని మోదీ ట్వీట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/21/b8d1b6cdc83b3a51f6eb4a98db9a3f9f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ జైపూర్ లోని ఎస్ఎమ్ఎస్ ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన ఛాతీ నొప్పి రావడం వల్ల తాను ఆసుపత్రిలో చేరినట్లు ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.
Post Covid I was having health issues & Since yesterday I was having severe pain in my chest. Just got my CT NGO done in SMS hospital.Angioplasty will be done.I am happy that I'm getting it done at SMS Hospital.I am fine & will be back soon.Your blessings & well wishes r with me.
— Ashok Gehlot (@ashokgehlot51) August 27, 2021
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నిన్నటి నుంచి తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది. ఎస్ఎమ్ఎస్ ఆసుపత్రిలో సీటీ ఎన్జీఓ పరీక్షలు చేశారు. యాంజియోప్లాస్టీ త్వరలోనే వైద్యులు చేస్తారు. నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే తిరిగి వస్తాను. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి.
అశోక్ గహ్లోత్, రాజస్థాన్ సీఎం
ఆసుపత్రిలో చేరిన తర్వాత అశోక్ గహ్లోత్ కి రక్తనాళాల పరీక్ష (యాంజియోప్లాస్టీ) నిర్వహించినట్లు సమచారం. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆరోగ్య మంత్రి రఘు శర్మ వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు సీఎం ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కొవిడ్ తర్వాత..
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తన ఆరోగ్యం సరిగా లేదని గహ్లోత్ పలు వర్చువల్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చెప్పారు. అందుకే ఆయన ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. గత రాత్రి దిల్లీకి వెళ్లాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా రద్దు చేసుకున్నారు.
70 ఏళ్ల అశోక్ గహ్లోత్.. 2018 డిసెంబర్ లో రికార్డ్ స్థాయిలో మూడోసారి రాజస్థాన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు 1998-2003, 2008-2013 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ప్రధాని ట్వీట్..
Praying for your good health and swift recovery, @ashokgehlot51 Ji. https://t.co/L2eszKldLe
— Narendra Modi (@narendramodi) August 27, 2021
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)