Rajasthan Cylinder Blast: పెళ్లింట ఘోర విషాదం, సిలిండర్ పేలి నలుగురు మృతి - 60 మందికి తీవ్ర గాయాలు
Rajasthan Cylinder Blast: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ పెళ్లింట సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు.
Rajasthan Cylinder Blast:
రాజస్థాన్‌లో...
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలోని ఓ పెళ్లింట్లో సిలిండర్ పేలి నలుగురు మృతి చెందారు. 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులూ ఉన్నారు. సిలిండర్ పేలు మంటలు అంటుకోవడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. "ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. 60 మంది గాయపడ్డారు. నలుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో 42 మందిని హాస్పిటల్‌కు తరలించాం. చికిత్స కొనసాగుతోంది" అని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించింది. చాలా సేపటి తరవాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంపై రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ విచారం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎంత పరిహారం చెల్లించాలో చూసి..అంత మేరకు వాళ్లకు అందజేస్తామని వెల్లడించారు. "కొందరు చిన్నారులు గాయాలతో బయట పడ్డారు. కొందరు మృతి చెందారు. వీలైనంత వరకూ అందరినీ కాపాడే ప్రయత్నమే చేస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాం. నిబంధనల ప్రకారం..అందరికీ పరిహారం అందజేస్తాం" అని స్పష్టం చేశారు.
Jodhpur, Rajasthan | Around 60 people injured after a house caught fire during a wedding in Bhungra village
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 9, 2022
It's a very serious accident. 42 people out of the 60 injured were referred to MGH hospital. Treatment is going on: Himanshu Gupta, District Collector (08.12) pic.twitter.com/9DYKOeHFrE
Rajasthan | Some children have sustained burn injuries. There have been deaths. Our efforts are underway to save the lives of as many people as we can. We'll try such incidents don't occur in future. Compensation to be given as per rules: CM Ashok Gehlot on Jodhpur incident pic.twitter.com/HrFLoIaCiz
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 9, 2022
Also Read: Hyderabad Crime News: పెళ్లి కోసం ప్రేమజంట మధ్య గొడవ - బ్లేడుతో ప్రియుడిపై దాడి చేసిన ప్రియురాలు