News
News
X

Rajasthan Election 2023: ఊపిరొదిలే వరకూ రాజకీయాలు వదలను, పార్టీ నాకు చాలా ఇచ్చింది - అశోక్‌ గహ్లోట్

Rajasthan Election 2023: చివరి శ్వాస వరకూ రాజకీయాల్లోనే ఉంటానని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ స్పష్టం చేశారు.

FOLLOW US: 
Share:

Rajasthan Election 2023:

రిటైర్ అయ్యేదే లేదు..

రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఊపిరి వదిలే వరకూ రాజకీయాలు వదిలేదే లేదని తేల్చి చెప్పారు. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. తన జీవితం కాంగ్రెస్‌కే అంకితం అని వెల్లడించారు. ఎప్పటి లాగే కాంగ్రెస్ నేతలంతా కలిసి వచ్చే ఎన్నికలను ఎదుర్కొంటారని స్పష్టతనిచ్చారు. ఇటీవలే ఆయన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో చాలా సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పద్దు తయారు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎన్నికల పోటీకి రెడీ అయినట్టు ఆ బడ్జెట్ స్పష్టంగా చెప్పింది. ఇలాంటి సమయంలో గహ్లోట్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. సీఎం కుర్చీ కోసం సచిన్ పైలట్ చాన్నాళ్లుగా పోటీ పడుతున్నారు. గహ్లోట్ వర్సెస్ పైలట్ ఫైట్ ఎన్నో రోజులుగా కొనసాగుతోంది. అధిష్ఠానం అప్పటికప్పుడు సర్ది చెబుతూ ఆ వివాదం ముదరకుండా చూస్తోంది. అయితే...ఇప్పుడు గహ్లోట్ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేదే లేదని తేల్చి చెప్పడం వల్ల మరోసారి పైలట్‌తో వివాదం ముదురుతుందా అన్న సంకేతాలిస్తున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో అధిష్ఠానం గురించి కూడా మాట్లాడారు గహ్లోట్. 
సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల ప్రస్తావన తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో తానే వచ్చే ఎన్నికలను సమర్థంగా ముందుకు నడిపిస్తానని స్పష్టం చేశారు. 

"నా చివరి శ్వాస వరకూ రాజకీయాలను వీడే ప్రసక్తే లేదు. నాకు 20-22 ఏళ్లున్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను. NSIUలో పని చేశాను. దాదాపు 50 ఏళ్లుగా రాజకీయాల్లోనే ఉన్నాను. ఇన్నేళ్లలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకుంది లేదు. నన్ను మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారంటే అధిష్ఠానం ఎంత ఆలోచించి ఉండాలి. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇలా అందరూ నాకు అవకాశామిచ్చారు. నా కాళ్లు చేతులు పని చేసేంత వరకూ కాంగ్రెస్‌కే విధేయుడిగా ఉంటాను. ఆ పార్టీ నాకు చాలా ఇచ్చింది" 

అశోక్ గహ్లోట్, రాజస్థాన్ సీఎంరాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్ అభాసుపాలయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆయన ఓ పొరపాటు చేశారు. ఫలితంగా బీజేపీ నేతలు ఒక్కసారిగా ఆందోళన చేశారు. గతేడాది బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. Indira Gandhi Urban Employment Guarantee పథకాన్ని గత బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్. ఇప్పుడు కూడా అదే పథకం గురించి మరోసారి ప్రస్తావించారు గహ్లోట్. కాసేపటి తరవాత కానీ అవి పాత బడ్జెట్ ప్రతులు అని అర్థం కాలేదు. వెంటనే గహ్లోట్ తన ప్రసంగాన్ని ఆపేశారు. అప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. మరీ ఇంత నిర్లక్ష్యమా అంటూ ఆందోళనకు దిగింది. తప్పుని గుర్తించిన అశోక్ గహ్లోట్ వెంటనే సభకు క్షమాపణలు చెప్పారు. అయినా...బీజేపీ శాంతించలేదు. శాంతించండి అంటూ స్పీకర్ ఎంతగా చెప్పినా సభలో గందరగోళం చాలా సేపటి వరకూ కొనసాగింది. ఆగ్రహించిన స్పీకర్..సభను వాయిదా వేశారు. రాజస్థాన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో సభ వాయిదా పడటం ఇదే తొలిసారి. దాదాపు అరగంట పాటు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. 

Also Read: Delhi Meerut Rapid Rail: మరో కొత్త ట్రైన్‌ వచ్చేస్తోంది,ఈ సారి ర్యాపిడ్ రైల్ - మొదట ఆ రూట్‌లోనే

Published at : 12 Feb 2023 02:26 PM (IST) Tags: Rajasthan CM Ashok gehlot Rajasthan Assembly Election Rajasthan Assembly Elections

సంబంధిత కథనాలు

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

Karimnagar Fire Accident: కరీంనగర్ లో వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు, రిటైర్డ్ ఎంపీడీవో సజీవ దహనం!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!

Viral News: తల్లులు కాబోతున్న 3 తరాల మహిళలు! తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్లకు ఒకేసారి గర్భం

Viral News: తల్లులు కాబోతున్న 3 తరాల మహిళలు! తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్లకు ఒకేసారి గర్భం

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Bandi Sanjay vs KTR: మంత్రి కేటీఆర్‌, బండి సంజయ్‌ పొలిటికల్‌ పంచాంగాలు ట్రెండింగ్ - ఓ రేంజ్ లో పంచ్ లు!

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

Karimnagar Crime News: కరీంనగర్ లో దారుణం - యువకుడి గొంతుకోసి దారుణ హత్య, మందు పార్టీ కొంపముంచిందా? 

టాప్ స్టోరీస్

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?

Political Panchamgam : ఏ పార్టీ పంచాంగం వారిదే - రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?

Political  Panchamgam :  ఏ పార్టీ పంచాంగం వారిదే -  రాజకీయ పార్టీల ఉగాది వేడుకల్లో ఏం చెప్పారంటే ?