అన్వేషించండి

Lok Sabha Election 2024: రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి, I.N.D.I.A నేతలకు షాక్ ఇచ్చిన సిద్దరామయ్య

Lok Sabha Election 2024: రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi PM Candidate:

పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలనుందని అన్నారు. ఈ వేడుకల్లో I.N.D.I.A కూటమి కీలక నేతలూ పాల్గొన్నారు. వాళ్ల ముందు రాహుల్ ప్రధాని అవ్వాలని మాట్లాడడమే చర్చకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ వేదికపైనే ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గేని ప్రధానిగా చూడాలంటూ ఇప్పటికే కొందరు ప్రతిపాదించారు. ఇప్పుడా ప్రతిపాదనకు భిన్నంగా సిద్దరామయ్య రాహుల్ పేరు ప్రస్తావించారు. 

"దేశంలో చాలా సమస్యలున్నాయి. వాటన్నింటినీ పరిష్కరించగలిగే సామర్థ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. అది జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలి. ఆయన రెండోసారి జోడో యాత్ర చేస్తున్నారు. దీనికి భారత్ న్యాయ్ యాత్ర అని పేరు పెట్టారు. ఈ దేశంలో ఏ రాజకీయ నేత కూడా భారత్ జోడో యాత్ర లాంటి యాత్రను చేయలేదు. దేశంలో వెనకబడిన వర్గాలు, దళితులు, మైనార్టీలు, మహిళలకు న్యాయం జరగాలి. అందుకే రాహుల్ రెండోసారి యాత్ర చేపడుతున్నారు"

- సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి 

విభేదాలు పక్కన పెట్టి..

అందరూ విభేదాలు పక్కన పెట్టి దేశం కోసం ఒక్కటవ్వాలని సూచించారు సిద్దరామయ్య. రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరముందని, అందరికీ న్యాయం అందించాలని అన్నారు. కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కూడా సిద్దరామయ్య ఇవే వ్యాఖ్యలు చేశారు. రాహుల్ ప్రధాని అవ్వాలని ఆకాంక్షించారు. అయితే...పార్టీ వేడుకల్లో హిందుత్వ గురించీ ప్రస్తావించారు సిద్దరామయ్య. తమను తాము సాఫ్ట్ హిందుత్వగా చెప్పుకున్నారు. తానూ హిందువునేనని, గ్రామాల్లో భజనలు చేసినప్పుడు తానూ వెళ్లేవాడినని అన్నారు. 

ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ని కాస్త డీలా పడేలా చేశాయి. లోక్‌సభ ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా జాగ్రత్త పడుతోంది ఆ పార్టీ. ఇప్పటికే విపక్ష కూటమిలోనే కీలక నేతలతో సమావేశమైంది. ఈ సమయంలోనే ప్రధాని అభ్యర్థి ఎవరన్న చర్చ వచ్చింది. కొంత మంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రస్తావించారు. దీనిపైనే నితీశ్ కాస్త అలక వహించినట్టు సమాచారం. లోపల ఎవరెవరు ఏం మాట్లాడారు అన్నది స్పష్టత లేకపోయినా ప్రధాని అభ్యర్థి విషయంలో భేదాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపైనే రాహుల్ గాంధీ నితీశ్ కుమార్‌కి కాల్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కూటమిలోని కొందరు నేతలకు, నితీశ్ కుమార్‌ మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిపాయి. కూటమి పేరుని I.N.D.I.A అని కాకుండా Bharat గా మార్చాలని కొందరు ప్రతిపాదించారు. దీనిపై నితీశ్ కుమార్ కాస్త గట్టిగానే వాదించారట. నితీశ్ కుమార్‌ని మీడియా చాలా సార్లు ప్రధాని అభ్యర్థి గురించి ప్రశ్నించింది. "మీరు ప్రధాని అభ్యర్థిగా ఉంటారా" అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు నితీశ్ కుమార్. పెద్దగా ఆసక్తి లేదన్న సంకేతాలిచ్చారు. అయితే..కూటమిలో మాత్రం తనను తాను ప్రధాని అభ్యర్థిగా చెప్పుకుంటున్నట్టు సమాచారం.

Also Read: Covid Cases in India: 24 గంటల్లో 5గురు మృతి,ఆందోళన పెంచుతున్న కొత్త వేరియంట్

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget