Rahul Gandhi: రాహుల్ ఇంకొంత టైమ్ కావాలని అడిగారు, నోటీసులైతే ఇచ్చాం - ఢిల్లీ పోలీసులు
Rahul Gandhi: శ్రీనగర్ వ్యాఖ్యలపై వివరాలు ఇచ్చేందుకు రాహుల్ మరికొంత సమయం కోరినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
Rahul Gandhi:
పోలీసుల విచారణ
శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రలో రాహుల్ వ్యాఖ్యలపై విచారణ పూర్తి చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా దీనిపై స్పందించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చేందుకు రాహుల్ మరి కొంత సమయం అడిగినట్టు వివరించారు. జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని, ఎవరు ఏం చెప్పారో గుర్తు చేసుకోవడానికి సమయం కావాలని కోరినట్టు వెల్లడించారు.
"రాహుల్ గాంధీతో సమావేశమయ్యాం. మేం అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాచారం ఇవ్వడానికి మరి కొంత సమయం కావాలని అడిగారు. ప్రస్తుతానికి మేం ఆయనకు నోటీసులు జారీ చేశాం. ఆ నోటీసులకు ఆయన అంగీకరించారు. ఒకవేళ మరోసారి ప్రశ్నించాల్సి వస్తే మేం అందుకు అనుగుణంగానే నడుచుకుంటాం. భారత్ జోడో యాత్రలో ఎంతో మందిని కలిశానని రాహుల్ చెప్పారు. మేం అడిగిన వివరాలను తప్పకుండా ఇస్తానని అన్నారు. ఆ తరవాతే మా ప్రొసీడింగ్స్ కొనసాగుతాయి"
- సాగర్ ప్రీత్ హుడా, ఢిల్లీ స్పెషల్ పోలీస్ కమిషనర్
Rahul Gandhi said it was a long yatra and he met many people and needs time to compile it. He has assured us that he will give the information soon and we will begin our proceedings as soon as we receive the information: Special CP(L&O) Sagar Preet Hooda pic.twitter.com/2bJgPM3CRd
— ANI (@ANI) March 19, 2023
We held a meeting with Rahul Gandhi. He said he needs some time and will give us the information which we've asked for. Today we've served a notice which has been accepted by his office and if questioning needs to be done then we will do it: Special CP(L&O) Sagar Preet Hooda pic.twitter.com/nCX0JXpM0A
— ANI (@ANI) March 19, 2023
కాంగ్రెస్ ఆగ్రహం..
దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు రాహుల్ ఇంటికి వచ్చారని మండి పడింది. అమిత్ షా ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోట్ ఆరోపించారు. ఈ విచారణ పూర్తైన వెంటనే రాహుల్ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు. మీడియా ఆయనను ప్రశ్నించేందుకు ప్రయత్నించినా...ఆగలేదు.
"అమిత్ షా ఆదేశాలివ్వకుండా ఇదంతా జరిగేదే కాదు. ఏ కారణం లేకుండా పోలీసులు ఇలా రాహుల్ ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పటికే నోటీసులు ఇచ్చారని రాహుల్ చెప్పారు. అందుకు సమాధానం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. అయినా పోలీసులు లోపలకు వచ్చారు"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
#WATCH | Congress leader Rahul Gandhi leaves from his residence after a team of Delhi police led by Special CP (L&O) Sagar Preet Hooda met him to seek information about the 'sexual harassment' victims who met him during Bharat Jodo Yatra. pic.twitter.com/4u14OYEc0z
— ANI (@ANI) March 19, 2023
Also Read: రాహుల్ హద్దులు దాటి మాట్లాడారు, డెమొక్రసీపై నమ్మకం లేని వాళ్లకు ఇక్కడ చోటు లేదు - జేపీ నడ్డా