By: Ram Manohar | Updated at : 02 Apr 2023 05:14 PM (IST)
సోషల్ మీడియాలో ప్రధానిని అదానీ వ్యవహారంపై మరోసారి ప్రశ్నించారు రాహుల్ గాంధీ.
Rahul Gandhi on PM Modi:
ఫేస్‌బుక్‌లో పోస్ట్..
రాహుల్ గాంధీ మరోసారి సోషల్ మీడియాలో ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. అదానీకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలంటూ ప్రశ్నించారు. 59 సెకన్ల ఓ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అదానీ అంశాన్నీ ప్రస్తావించారు. అదానీ వ్యవహారంపై ఎన్నో రోజులుగా ప్రశ్నిస్తున్నా...తనకు ప్రధాని సమాధానం చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తున్నట్టు వివరించారు.
"ప్రధాని గారూ. మిమ్మల్ని చాలా రోజులుగా కొన్ని ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాను. ఇప్పటి వరకూ వాటికి బదులు ఇవ్వలేదు. అందుకే అవే ప్రశ్నల్ని మళ్లీ అడుగుతున్నాను. ఆ రూ.20 వేల కోట్లు ఎవరివి..? LIC,SBI,EPFOలో డిపాజిట్ చేసిన డబ్బులన్నీ అదానీకి ఎందుకు ఇస్తున్నారు..? మీకు, అదానీ మధ్య సంబంధం ఏంటో ఈ దేశానికి సమాధానం చెప్పండి"
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత
అదానీ గ్రూప్‌లో అవకతవకలపై హిండన్‌బర్గ్ రిపోర్ట్ ఇచ్చినప్పటి నుంచి రాహుల్ గాంధీ ప్రధానిపై తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. పదేపదే ఇదే వ్యవహారంపై ప్రశ్నిస్తున్నారు. అదానీ, ప్రధాని మధ్య సంబంధం ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని విచారించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంది. బీజేపీ మాత్రం ఈ డిమాండ్‌లను లెక్క చేయడం లేదు. ఇక రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ తీసుకున్న నిర్ణయాన్నీ తీవ్రంగా ఖండిస్తోంది కాంగ్రెస్. అదానీ గురించి ప్రశ్నించినందుకే వేటు వేశారని ఆరోపిస్తోంది.
భయం కనిపించింది..
తనపై అనర్హతా వేటు పడిన తరవాత మీడియా ముందుకు వచ్చారు రాహుల్ గాంధీ. మోదీ హయాంలో ప్రజాస్వామ్యంపై రోజూ దాడి జరుగుతూనే ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని AICC హెడ్‌క్వార్టర్స్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన..యూకే స్పీచ్‌పై కొందరు కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేశారని మండి పడ్డారు. ప్రశ్నించడం ఆపేయను అని తేల్చి చెప్పిన రాహుల్...దేనికీ భయపడను అని స్పష్టం చేశారు. అదానీ అంశాన్ని ప్రస్తావించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి అదానీతో సంబంధాలు న్నాయని ఆరోపించారు. అదానీ, మోదీ సంబంధంపై మాట్లాడినందుకే ఈ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీకి ఎయిర్‌పోర్ట్‌లను గంపగుత్తగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందుకోసం నిబంధనలు కూడా అనుకూలంగా మార్చేశారని విమర్శించారు. అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తూనే ఉంటాని తేల్చి చెప్పారు. అదానీకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎలా వచ్చాయో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ఉద్దేశపూర్వకంగా తన ప్రసంగాలను రికార్డుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఈ దేశం తనకు అన్నీ ఇచ్చిందని, అందుకే ఈ పోరాటం చేస్తున్నానని అన్నారు. అదానీ వ్యవహారంపై తన ప్రసంగాన్ని విని ప్రధాని మోదీ భయపడ్డారని, ఆయన కళ్లలోనూ ఆ భయం కనిపించిందని తెలిపారు రాహుల్. అందుకే ముందు ఈ వ్యవహారం నుంచి దృష్టి మరల్చారని, ఆ తరవాత తనపై అనర్హతా వేటు వేశారని మండి పడ్డారు. తనకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేతలందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన సభ్యత్వాన్ని పునరుద్ధరించినప్పటికీ పోరాటం ఆగదు అని తేల్చి చెప్పారు.
Also Read: Bihar Ram Navami Clash: బిహార్‌లో హై అలెర్ట్,అన్ని చోట్లా భద్రత కట్టుదిట్టం - రంగంలోకి అదనపు బలగాలు
Amit Shah Vizag Tour: నేడు విశాఖలో అమిత్ షా సభ, కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా వైజాగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!
TSPSC HO Exam Halltickets: జూన్ 11 నుంచి హార్టికల్చర్ హాల్‌టికెట్లు అందుబాటులోకి! పరీక్ష ఎప్పుడంటే?
Postal Jobs: 12,828 పోస్టాఫీసు ఉద్యోగాల దరఖాస్తుకు రేపే ఆఖరు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
TSPSC Group 1 Exam: వారికీ గ్రూప్-1 హాల్‌టికెట్లు ఇవ్వండి, టీఎస్పీఎస్సీని ఆదేశించిన హైకోర్టు!
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!
Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!
Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !