Rahul Gandhi: ఆ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ ఇచ్చారా? పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్‌లో ప్రస్తావన వచ్చిందా!
Rahul Gandhi:యూకే స్పీచ్‌పై రాహుల్ గాంధీ పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్‌లో వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Rahul Gandhi:
జైశంకర్ నేతృత్వంలో భేటీ..
రాహుల్ గాంధీ యూకే స్పీచ్‌పై దాదాపు వారం రోజులుగా బీజేపీ,కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాహుల్ తప్పకుండా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం ససేమిరా అంటోంది. అయితే...పార్లమెంటరీ ప్యానెల్ మీటింగ్‌లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్ G20 సదస్సుపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే పలువురు బీజేపీ ఎంపీలు ఉన్నట్టుండి రాహుల్ వ్యాఖ్యల ప్రస్తావన తీసుకొచ్చినట్టు సమాచారం. ఈ మేరకు రాహుల్ వివరణ కూడా ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినంత మాత్రాన తనపై యాంటీ నేషనల్ ముద్ర వేయడం సరికాదని చెప్పారట. అంతే కాదు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశాలను జోక్యం చేసుకోవాలన్న వ్యాఖ్యలనూ తప్పుదోవ పట్టించారని అన్నారు. వాళ్లు ఆ సమస్యకు పరిష్కారం చూపుతారేమో అన్న ఆలోచన తప్ప మరే ఉద్దేశమూ లేదని వివరించినట్టు తెలుస్తోంది. జైశంకర్...G20 సదస్సుపై పూర్తిస్థాయిలో చర్చించిన తరవాత ఓ బీజేపీ ఎంపీ రాహుల్ వ్యాఖ్యల ప్రస్తావన తీసుకొచ్చారట. మొదట్లో రాహుల్ మాట్లాడలేదని, ఆ తరవాత బీజేపీ ఎంపీలు ఒకరి తరవాత ఒకరు ప్రస్తావించాక..అప్పుడు ఆయన వివరణ ఇచ్చారట. ఈ వివరణ ఇచ్చేందుకు ఇది సరైన వేదిక కాదని కొందరు వారించినప్పటికీ...ప్రతిపక్ష ఎంపీలు రాహుల్‌కు అండగా నిలబడ్డారని సమాచారం. ఆయనకు మాట్లాడే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ఒక్కసారిగా వివాదం ముదరడం వల్ల విదేశాంగ మంత్రి జైశంకర్ అందరినీ వారించారట. ఇవన్నీ పార్లమెంట్‌లోనే మాట్లాడుకోవాలని సూచించారని తెలుస్తోంది.
Chaired the Parliamentary Consultative Committee for External Affairs on India’s G20 Presidency.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 18, 2023
Thank members for their active participation. pic.twitter.com/3DW5HrR5zq
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాహుల్ గాంధీపై మరోసారి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యంపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. డెమొక్రసీపై నమ్మకం లేని వారికి..ఈ ప్రజాస్వామ్య దేశంలో స్థానం లేదంటూ ఘాటుగా స్పందించారు. చెన్నైలో నేషనల్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో వర్చువల్గా హాజరైన నడ్డా...ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మతి పోయిందని, అందుకే భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశాలను జోక్యం చేసుకోవాలని అడుగుతోందని మండి పడ్డారు. అమెరికా, యూరప్ దేశాలను భారత్లోని ప్రజాస్వామ్యాన్ని చక్కదిద్దాలని అడగడంపై అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ హద్దులు దాటి మాట్లాడారని అన్నారు. ఆయన మాటల్ని ప్రజలు లెక్క చేయొద్దని సూచించారు.
"రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడి దేశం పరువు తీయడమే కాదు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశాలు జోక్యం చేసుకోవాలని అన్నారు. ఇది సిగ్గు చేటు"
- జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
కాంగ్రెస్ మాత్రం బీజేపీపై ఎదురుదాడికి దిగుతోంది. పార్లమెంట్లో ప్రతిపక్షాలు మాట్లాడకుండా మైక్ ఆఫ్ చేస్తున్న మాట వాస్తవమే అని తేల్చి చెబుతోంది. అదానీ అంశాన్ని ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకే బీజేపీ రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిస్తోంది.
Also Read: Rahul Gandhi: రాహుల్ ఇంకొంత టైమ్ కావాలని అడిగారు, నోటీసులైతే ఇచ్చాం - ఢిల్లీ పోలీసులు