అన్వేషించండి

Bharat Ratna Award: మాజీ ప్రధానులు పీవీ నరసింహా రావు, చరణ్ సింగ్‌కి భారతరత్న - కేంద్రం కీలక ప్రకటన

Bharat Ratna Award: మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది.


మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహా రావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. X వేదికగా పోస్ట్ పెట్టారు. పీవీ నరసింహా రావుని భారతరత్నతో సత్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పీవీ నరసింహారావుతో పాటు మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కి కూడా భారతరత్న ప్రకటించారు. వీరితో పాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ్‌ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా వీళ్ల సేవల్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ. పీవీ నరసింహా రావు ఓ మేధావి అంటూ ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్రమంత్రిగానూ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించారని అన్నారు. అటు ఎంపీగానూ ఎన్నో ఏళ్లుగా సేవలందించారని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన వ్యక్తి అంటూ కొనియాడారు. దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశారని అన్నారు. ప్రధానిగా ఆయన అందించిన సేవల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని వెల్లడించారు. 

మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కీ భారతరత్న ఇస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. దేశానికి ఆయన అందించిన సేవలకు లభించిన సత్కారమని వెల్లడించారు. రైతుల సంక్షేమం, హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ హోం మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన అందించిన సేవల్ని స్మరించుకున్నారు. ఎమర్జెన్సీ రోజులకు ఎదురు నిలిచి ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు. ఆయన దేశానికి స్ఫూర్తిదాయకం అని అన్నారు.

ఇక హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్‌ ఎస్ స్వామినాథన్‌ సేవల్నీ గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశ వ్యవసాయ రంగానికి, రైతులకు ఆయన అందించిన సేవలను ఇలా గౌరవించుకుంటున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో భారత్ ఆత్మ నిర్భరతతో నిలబడడానికి కారణం స్వామినాథన్ అంటూ ప్రశంసించారు. ఆయన కేవలం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా...ఆహార భద్రతనూ కల్పించారని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Embed widget