ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అరెస్ట్‌కు రంగం సిద్ధం, పంజాబ్‌లో హైటెన్షన్
Amritpal Singh Arrest: ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పంజాబ్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Amritpal Singh Arrested:
అరెస్ట్‌కు రెడీ..
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయన అనుచరులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాలనూ స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ పోలీసులు అతడిపై మూడు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి అలజడులూ చెలరేగకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలు, SMS సర్వీసులు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. మెర్సిడెస్ కార్‌ను వదిలేసి వేరే కార్‌ను కొనుగోలు చేసిన అమృత్ పాల్ సింగ్..చాలా రోజులుగా అండర్‌గ్రౌండ్‌లో ఉంటున్నాడు. అతడిని అరెస్ట్ చేయాలంటూ చాలా రోజులుగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
Punjab Police has launched action against Khalistani sympathiser Amritpal Singh and his aides. Details awaited. pic.twitter.com/mhrlf6HY7A
— ANI (@ANI) March 18, 2023
All mobile internet services, all SMS services (except banking & mobile recharge) & all dongle services provided on mobile networks, except the voice call, in the territorial jurisdiction of Punjab shall be suspended from 18th March (12:00 hours) to 19th March (12:00 hours) in… https://t.co/KZYVKiA8xn
— ANI (@ANI) March 18, 2023
ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసిన నేపథ్యంలో పంజాబ్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా సహకరించాలని ప్రజల్ని కోరింది. ఎలాంటి వదంతులూ వ్యాప్తి చేయొద్దని సూచించింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని తెలిపింది. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేసింది. కొద్ది వారాలుగా చురుగ్గా ఉద్యమం చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్. గత నెల ఖలిస్థాన్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. అజ్నల పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. అమృత్ పాల్ సింగ్ అనుచరుడిని అరెస్ట్ చేయడంపై అలజడి సృష్టించారు. ఇప్పటికే ఆరుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో అమృత్ యాక్టివ్‌గా ఉండడమే కాకుండా..తనను పోలీసులు వెంటాడుతున్నారంటూ వీడియోలు పోస్ట్ చేశాడు.
Request all citizens to maintain peace & harmony
— Punjab Police India (@PunjabPoliceInd) March 18, 2023
Punjab Police is working to maintain Law & Order
Request citizens not to panic or spread fake news or hate speech pic.twitter.com/gMwxlOrov3
Also Read: Mark Zuckerberg: మా జాబ్‌ల పరిస్థితేంటి? మిమ్మల్ని ఎలా నమ్మమంటారు? - జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు