By: ABP Desam | Published : 25 Jul 2021 12:46 PM (IST)|Updated : 25 Jul 2021 12:46 PM (IST)
సచిన్ పైలట్
పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించాలని డిసైడ్ అయింది. ఇటీవలే పంజాబ్ సమస్యకు చెక్ పెట్టిన అధిష్ఠానం ఇప్పుడు రాజస్థాన్‌లోనూ రాజీకి యత్నిస్తోంది. ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ నిర్వహించనుంది. గతంలో తిరుగుబాటు చేసి చల్లబడిన సచిన్ పైలట్ వర్గాన్ని సంతృప్తి పరిచే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సీఎం గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య చాలా కాలం నుంచి విభేదాలున్నాయి
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ..
ఈ మేరకు కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే అధిష్ఠానం తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి కే.సి.వేణుగోపాల్, రాజస్థాన్ ఇన్‌ఛార్జి అజయ్ మాకెన్ శనివారం జైపుర్ చేరుకున్నారు. నేరుగా సీఎం అశోక్ గహ్లోత్ నివాసానికి వెళ్లిన వారు అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 27 లేదా 28న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
గత నెల యూపీకి చెందిన కీలక నేత జితిన్ ప్రసాద కాంగ్రెస్‌ను వీడి భాజపా గూటికి చేరడంతో సచిన్ పైలట్ తిరుగుబాటు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సచిన్‌ను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు లేకపోతే కాంగ్రెస్ మరో యువనేతను కూడా కోల్పోవాల్సి ఉంటుందన్న విశ్లేషణలు వెలువడ్డాయి. అదే సమయంలో పైలట్ కూడా దిల్లీ పర్యటనకు వెళ్లడంతో.. అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకోవడానికే వెళ్లారంటూ ఊహాగానాలు వినిపించాయి. అయితే, వాటని తోసిపుచ్చిన ఆయన అధిష్ఠానంతో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయన్నారు. తన డిమాండ్లపై పార్టీ త్వరలో సరైన నిర్ణయం తీసుకోనుందని ప్రకటించారు.
ఇటీవలే పంజాబ్ సమస్యకు కాంగ్రెస్ అధిష్ఠానం స్వస్తి పలికింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధుల మధ్య చాలా రోజుల నుంచి నెలకొన్న విభేదాలకు కాంగ్రెస్ అధిష్ఠానం తెలివిగా చెక్ పెట్టింది. సీఎంకు వ్యతిరేకంగా గళం వినిపించి సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి బుజ్జగించింది. సిద్ధూకి పీసీసీ పదవి ఇవ్వద్దని చెప్పిన అమరీందర్ సింగ్ తోనూ నేరుగా మాట్లాడి పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలికింది. ఇదే ఐడియాతో ప్రస్తుతం రాజస్థాన్ లో సీఎం గహ్లూత్, సచిన్ పైలట్ మధ్య ఉన్న కోల్డ్ వార్ ను ఆపాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచిస్తోంది. మరి రాజస్థాన్ లో రాజీ కుదురుతుందా చూడాలి..!
Karti Chidambaram: కార్తీ చిదంబరం ఇల్లు, ఆఫీసుపై సీబీఐ దాడులు- సెటైర్ వేసిన ఎంపీ
Rajyasabha Candidates: వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే, ఖరారు చేసిన సీఎం జగన్? ఈయనకి మళ్లీ ఛాన్స్
Cabs Bundh: అలర్ట్! ఈ నెల 19న క్యాబ్స్ బంద్, ఆటోలు కూడా - పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపు
Parag Agrawal On Twitter Spam: పరాగ్ X మస్క్- స్పామ్ అకౌంట్లపై తగ్గేదేలే అంటూ ట్వీట్ వార్!
Nalgonda: ‘పైసలియ్యి, లేకుంటే చావు’ పెళ్లి కాకముందే కట్నం కోసం వరుడి మెసేజ్‌లు - యువతి ఆత్మహత్య
AP PCC New Chief Kiran : వైఎస్ఆర్సీపీతో పొత్తు దిశగా ప్లాన్ - ఏపీ పీసీసీ చీఫ్‌గా మాజీ సీఎం !?
Viral video: అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రి వేళ భూమిని చూస్తే ఆ కిక్కే వేరప్పా
Chethana raj Passed Away: కాస్మొటిక్ సర్జరీ వికటించి టీవీ నటి చేతనా రాజ్ మృతి
Prabhas: ప్రభాస్‌కు కండిషన్లు పెట్టిన దర్శకుడు?