Teachers' Day 2021: 44 మందికి 'ఉత్తమ ఉపాధ్యాయ' అవార్డులు ప్రదానం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 44 మందికి రాష్ట్రపతి నేడు అవార్డులు ప్రదానం చేశారు. కొవిడ్ కారణంగా వర్చువల్ గా ఈ కార్యక్రమం జరిగింది.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈరోజు ప్రదానం చేశారు. 44 మంది ఉపాధ్యాయులు ఈ అవార్డును అందించారు. సరికొత్త బోధనా పద్దతులతో పిల్లల భవిష్యత్తును నిర్మించిన వారిని ఉత్తమ గురువులుగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణను రామ్ నాథ్ కోవింద్ కీర్తించారు.
डॉक्टर राधाकृष्णन एक दार्शनिक और विद्वान के रूप में विश्व-विख्यात थे। यद्यपि उन्होंने अनेक उच्च पदों को सुशोभित किया, परंतु वे चाहते थे कि उन्हें एक शिक्षक के रूप में ही याद किया जाए। डॉक्टर राधाकृष्णन ने एक श्रेष्ठ शिक्षक के रूप में अपनी अमिट छाप छोड़ी है।
— President of India (@rashtrapatibhvn) September 5, 2021
President Ram Nath Kovind confers 44 teachers with National Awards, via video conference pic.twitter.com/WfSJ9L0AWh
— ANI (@ANI) September 5, 2021
Dr Radhakrishnan was known as a philosopher & scholar across the world.... He wanted to be remembered only as a teacher. He has left an indelible mark as a great teacher: President Ram Nath Kovind on Teacher's Day pic.twitter.com/x2KfefmiRJ
— ANI (@ANI) September 5, 2021
విద్యావేత్తగా, తత్వవేత్తగా ప్రపంచం మొత్తానికి డా. రాధాకృష్ణ పేరు తెలుసు. కానీ ఆయన మాత్రం అందరూ తనని ఓ ఉపాధ్యాయుడిగా గుర్తుపెట్టుకోవాలనుకున్నారు. ఓ గొప్ప ఉపాధ్యాయుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు.
రామ్ నాథ్ కోవింద్, రాష్ట్రపతి
శిక్షక్ పర్వ్ పేరుతో ఈరోజు నుంచి సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఈ కర్యాక్రమాన్ని జరపనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 44 మంది టీచర్లకు సంబంధించిన డాక్యుమెంటరీలను కూడా ఇందులో చూపిస్తారు. కొవిడ్ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు.