Student cut his private part: అమ్మాయిగా మారాలని ప్రైవేటు పార్ట్ కోసేసుకున్నాడు - చివరికి ఏమయ్యాడంటే ?
Prayagraj: ప్రయాగరాజ్‌లో ఓ యువకుడు ప్రైవేటు పార్టును కోసుకుని ఆస్పత్రి పాలయ్యాడు. ఎందుకిలా చేశావురా అని అందరూ అడిగితే అమ్మాయిగా మారేందుకని సమాధానం చెప్పాడు.

UPSC student cut his private part to become a girl: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో UPSC పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ ఇరవై ఏళ్ల యువకుడు ప్రైవేటు పార్ట్ కట్ చేసుకున్నాయి. బాధతో విలవిల్లాడుతూ తన గది నుంచి కేకలు వేయడంతో ఇంటి యజమాని వచ్చి ఆస్పత్రికి తరలించాడు. ఎందుకిలా చేశావని వైద్యులు, కుటంబసభ్యులు అడిగితే..తాను అమ్మాయినని..తనకు ప్రైవేటు పార్టు మగవాళ్లది వచ్చిందని అందుకే కట్ చేసుకున్నాని చెబుతున్నాడు.
చిన్న తనం నుంచి అమ్మాయిని అనుకునే యువకుడు
అమేధీకి చెందిన యువకుడు.. పోటీ పరీక్షలకు చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటాని పెద్దలకు చెప్పి ప్రయాగరాజ్ కు వచ్చాడు. అక్కడే ఓ గది తీసుకుని క్లాసులకు వెళ్తున్నాడు. కానీ వచ్చినప్పటి నుండి అతను క్లాసుల కన్నా.. తాను అమ్మాయిగా మారాలన్న ఆలోచనతోనే ఉండేవాడు. 14 ఏళ్ల వయస్సు నుంచే తనను తాను ఒక అమ్మాయి అనిపించడం మొదలైందని, కానీ తల్లిదండ్రుల ఏకైక కుమారుడిగా ఉండటం వల్ల ఈ భావాలను ఎవరితోనూ పంచుకోలేకపోయానని బాధపడేవాడు.
యూట్యూబ్ చూసి ప్రైవేటు పార్ట్ కట్ చేసుకోవాలని నిర్ణయం
లింగ మార్పిడి చేసుకోవచ్చని యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాడు. చివరికి కట్రా లో ఒక క్వాక్ డాక్టర ని సంప్రదించాడు. ఆ డాక్టర్ సలహా మేరకు మెడికల్ స్టోర్ నుంచి ఏనస్థీషియా ఇంజెక్షన్, సర్జికల్ బ్లేడ్ కొనుగోలు చేశాడు. యూట్యూబ్ వీడియోలు చూసి.. డాక్టర్ చెప్పినట్లుగా.. తనకు అనస్థీషియా ఇచ్చుకుని తన చేతులతోనే ప్రైవేట్ భాగాన్ని కట్ చేశాడు. ఇంజెక్షన్ ప్రభావం ఉన్నప్పుడు అతను సాధారణ స్థితిలోనే ఉన్నాడు. కానీ, ప్రభావం తగ్గిన తర్వాత తీవ్రమైన నొప్పి మొదలైంది. అయితే నొప్పి తగ్గడానికి ఇతర మందులు తీసుకున్నాడు. తాను అలా చేయడం ఎవరికీ తెలియకూడదని.. నొప్పి బిగపట్టాడు. కానీ నిమిషాలు గడిచేకొద్దీ నొప్పి భరించలేని విధంగా మారడంతో ఇంటి ఓనర్‌ను పిలిచి జరిగింది చెప్పాడు.
బాధ భరించలేక ఇంటి ఓనర్‌కు చెప్పిన యువకుడు
ఇంటి ఓనర్ వెంటనే ఆంబులెన్స్ పిలిపించి, యువకుడిని తేజ్ బహాదూర్ సప్రూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతని పరిస్థితి తీవ్రంగా ఉందని చూసి, SRN ఆసుపత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ చికిత్స జరుగుతోంది . తన ప్రైవేటు పార్ట్ కోసుకుంటే ప్రాణం పోతుందని తెలియదని తాను అమ్మాయినని వరూ ఆ మాటలు వినలేదని చెప్పాడు.
హార్మోన్ థెరపీ తర్వాత లింగ మార్పిడి చేయించవచ్చన్న వైద్యులు
ఈ యువకుడు జెండర్ ఐడెంటిటీ డిసార్డర్ లేదా జెండర్ డిస్ఫోరియా అనే వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధిలో రోగికి తను వ్యతిరేక లింగం అనిపిస్తుంది. ఆసుపత్రికి తీసుకురావడంలో మరింత ఆలస్యం జరిగి ఉంటే అతని ప్రాణాలు పోయేవని.. సైకియాట్రిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ చేయిస్తామని వైద్యులు చెబుతున్నారు. ఒక సంవత్సరం హార్మోన్ థెరపీ , చికిత్సల తర్వాత లింగ మార్పిడి ప్రక్రియను ప్రారంభించవచ్చునని డాక్టర్లు తెలిపారు.





















