అన్వేషించండి

Tamilnadu Crime: రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు, భార్య, ఆమె ప్రియుడు తలలు నరికాడు- పోలీస్ స్టేషన్‌కెళ్లి లొంగిపోయాడు !

Tamil Nadu: తమిళనాడులో ఓ వ్యక్తి భార్య, ఆమె ప్రియుడిని దారుణంగా నరికి చంపాడు. తలలు తెంపి.. తలలతో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

Man beheaded his wife and her boyfriend:  తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూర్ జిల్లాలో  ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడిగా అనుమానించిన వ్యక్తిని కిరాతకంగా నరికి చంపి, వారి తలలతో నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన తిరుప్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది.

రాజేష్ అనే 35 ఏళ్ల వ్యక్తి, తన భార్య సుమతి, ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు అనుమానించిన  వ్యక్తిని హత్య చేశాడు. రాజేష్, తన భార్య సుమతి సురేష్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉందని గత కొన్ని నెలలుగా అనుమానిస్తూ వస్తున్నాడు.  అనుమానం  కారణంగా జరిగిన తీవ్ర వాగ్వివాదం హత్యలకు దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వారిద్దరి ఇంటిలో ఉన్న సమయంలో చూసి.. రాజేష్ కోపంతో గొడవ పెట్టుకున్నాడు. వాగ్వాదంలో రాజేష్, కోపంతో ఒక కత్తితో సుమతి , సురేష్‌లను నరికి చంపాడు. ఆ తర్వాత, ఆ రెండు తలలను తీసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు స్కూటర్‌పై వెళ్లి లొంగిపోయాడు.

"నేను నా భార్య , ఆమె ప్రియుడిని చంపాను, ఇవిగో వారి తలలు" అంటూ లొంగిపోయాడు. ఈ ఘటన పోలీసులను కూడా షాక్‌కు గురిచేసింది. తిరుప్పూర్ జిల్లా పోలీసులు వెంటనే రాజేష్‌ను అదుపులోకి తీసుకుని, హత్య ఆయుధంగా ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద సెక్షన్ 103 (హత్య) సహా ఇతర సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. హత్య జరిగిన స్థలంలో ఫోరెన్సిక్ బృందం సాక్ష్యాధారాలను సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

  "ఇది అత్యంత దారుణమైన ఘటన. రాజేష్‌ను విచారిస్తున్నాము,  ఈ హత్యల వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు లోతైన విచారణ జరుపుతున్నాం," అని పోలీసులు తెలిపారు.  సుమతి, సురేష్ మధ్య సంబంధం గురించిన ఆరోపణలను ధృవీకరించేందుకు కూడా పోలీసులు సాక్షులను విచారిస్తున్నారు. ఈ ఘటన స్థానిక గ్రామంలో భయాందోళనలను రేకెత్తించింది. సుమతి మరియు రాజేష్ దంపతుల మధ్య గతంలో కూడా తరచూ వివాదాలు జరిగేవని, కానీ ఇంత దారుణ స్థాయికి వెళ్తుందని ఎవరూ ఊహించలేదని స్థానికులు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Hyderabad Crime News: బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
బీటెక్ విద్యార్థిది ప్రీ ప్లాన్ మర్డర్.. మరదలు తనకు దక్కదన్న కోపంతో హత్యకు బావ ప్లాన్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Mahabubnagar Road Accident: మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి
మహబూబ్‌నగర్‌లో స్పోర్ట్స్‌ బైక్, కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Embed widget