అన్వేషించండి

Prajwal Revanna case : దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న దేవేగౌడ మనవడి లైంగిక వేధింపుల కేసు - అసలేం జరిగిందంటే ?

National Politics : ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేవేగౌడ మనవడు కావడం, బీజేపీతో పొత్తులో ఉండటంతో మరింతగా ఈ అంశం చర్చనీయాంశమవుతోంది.

Prajwal Revanna case Full details :  కర్ణాటకలో మొదటి విడత పోలింగ్ శుక్రవారం జరిగింది. అంతకు రెండు రోజుల ముంద హసన్ నియోజకవర్గ ఎంపీ, బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్య ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల్లో ఇది సంచలనంగా మారింది. దానిపై రాజకీయ దుమారం ప్రారంభమయ్యే లోపు పోలింగ్ ముగిసింది. 

ప్రజ్వల్ రేవణ్ణ ఎవరంటే ? 

దేవేగౌడ పెద్ద కుమారుడి కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ.  హెచ్‌డీ రేవణ్ణ జేడీఎస్ కీలక నేత. ఆయన మంత్రిగా కూడా చేశారు. ఆయన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ, గతంలో హసన్ నియోజకవర్గం నుంచి దేవెగౌడనే పోటీ చేసేవారు. అయితే ఆయనకు వయోభారం పెరగడంతో రాజకీయ వారసత్వాన్ని మనవడికి అప్పగించి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. 2014లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన నియోజకవర్గాల్లో హహన్ ఒక్కటే గెలిచారు. ఆయన మాత్రమే జేడీఎస్ ఎంపీగా లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీ మూడు సీట్లను కేటాయిస్తే అందులో ఒకటి హసన్. సిట్టింగ్ ఎంపీ అయిన ప్రజ్వల్ కే సీటు కేటాయించారు. 

వైరల్‌గా మారిన ప్రజ్వల్ రేవణ్ణ  వీడియోలు

పోలింగ్ కు రెండు రోజుల ముందు వైరల్ అయిన వీడియోల్లో ప్రజ్వల్ రేవణ్య ఓ మహిళను లైంగికంగా వేధిస్తూ కనిపించారు. ఆయన వీడియోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  కొన్ని ఆడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. 

ఫిర్యాదు చేసిన బంధువు అయిన మహిళ 

ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణకు సమీప  బంధువు అయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడి వయసు ఉన్న ఆ మహిళ కు ఉద్యోగం అవసరం కావడంతో ఉద్యోగాలు ఇప్పించారు. చివరికి తన ఇంట్లోనే ఉద్యోగం ఇచ్చారు.  అవకాశం దొరికినప్పుడల్లా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.తన కుమార్తెను కూడా ఫోన్ చేసి వేధించేవారని తెలిపింది. ఆ బాధలు పడలేక తన కుమార్తె ప్రజ్వల్ ఫోన్ నెంబర్ ను బ్లాక్ చేసిందని.. తర్వాత తాను కూడా ప్రజ్వల్ ఇంట్లో ఉద్యోగం మానేశానని తెలిపింది. 

ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం 
 
వీడియోల్లో ఒక మహిళను లైంగికంగా వేధిస్తున్నట్టు ఉన్నదని ఆయన అన్నారు. హోళెనరసిపుర పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సిట్ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించారు. ప్రజ్వల్ ఒకరిద్దర్ని కాదని చాలా మందిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటిపైనా సిట్ దర్యాప్తు చేయనుంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు చేస్తుందని  ప్రజ్వల్ రేవణ్ణ సమీప బంధువు.. జేడీఎస్ చీఫ్ కుమారస్వామి చెప్పుకొచ్చారు. 

జర్మనీ పారిపోయిన ప్రజ్వల్ 

మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ సైలెంట్ గా దేశం విడిచి వెళ్లిపోయారు. కేసు నమోదైన తర్వాతనే ఆయన దేశం విడిచి జర్మనీ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపైనా రాజకీయ దుమారం రేగుతోంది. అతడిని వెనక్కు తీసుకువచ్చి విచారణ కొనసాగించే బాధ్యత సిట్ తీసుకుంటుందని  ప్రభుత్వం ప్రకటించింది. అయితే తన పేరుతో సర్క్యూలేట్ అవుతున్న వీడియోలు   నవీన్‌ గౌడ అనే వ్యక్తి మార్ఫింగ్‌ చేశారని  తన ఎన్నికల ఏజెంట్‌ ద్వారా ప్రజ్వల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
బీజేపీకి కొత్త సమస్య

జేడీఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ప్రధాని మోదీ ప్రజ్వల్ రేవణ్ణకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. కర్ణాటకలో మరో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ కారణంగా ఈ కేసు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందేమోనని బీజేపీ కంగారు పడుతోంది. ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసుపై రాను రాను మరింత దుమారం రేగే అవకాశం ఉంది. 

కర్ణాటక రాజకీయాల్లో ఇలాంటి లైంగిక వేధింపుల అంశాలు తరచూ హైలెట్ అవుతూంటాయి. గతంలో అసెంబ్లీలోనే అశ్లీల వీడియోలు చూస్తూ కొంత మంది దొరికిపోయారు. తర్వాత రమేష్ జార్కిహోళి అనే మంత్రి కూడా ఇలాంటి వీడియోల్లో కనిపించి పదవి పోగొట్టుకున్నారు. ఇటీవల మాజీ మంత్రి యడ్యూరప్పపైనా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget