Andhra Odisha Egg Row : ఏపీ, ఒరిస్సా మధ్యలో ఎగ్గు ! ఇదో కొత్త పంచాయతీ
ఏపీ నుంచి గుడ్ల లోడుతో వెళ్తున్నలారీలను ఒరిస్సాలో పౌల్ట్రీ రైతులు అడ్డుకుంటున్నారు. దీంతో వందల లారీలుహైవేపై నిలిచిపోయాయి. గుడ్లు పాడైపోతాయని ఏపీ పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ - ఒరిస్సా మధ్య కొత్తగా కోడి గుడ్ల పంచాయతీ వచ్చింది. ఆంధ్రా కోడు గుడ్ల లారీలను జాతీయ రహదారి పై ఖుర్దారోడ్ వద్ద ఒరిస్సా లేయర్ కోళ్ల రైతులు , ట్రేడర్లు అడ్డుకున్నారు. రవాణా చేయడానికి వీల్లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రెండు రోజుల నుంచి ఇదే విధంగా లారీలను ఆపేస్తున్నారు దీంతో దాదాపుగా రెండు వందల ఏపీ రైతుల కోడి గుడ్ల లారీలు ఒరిస్సాలో నిలిచిపోయాయి. ఏపీ ఎగ్ ట్రేడర్స్ ఉన్న పళంగా ఒరిస్సా వెళ్లి అక్కడి లేయర్ కోళ్ల రైతులు, ఎగ్ ట్రేడర్లతో చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. వారు లారీలను వదిలి పెట్టడానికి అంగీకరించడానికి సిద్ధంగా లేరు.
మే 10 నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ - 151 సీట్లు తగ్గకూడదన్న సీఎం జగన్!
నలభై ఎనిమిది గంటలకుగా లారీలన్నీ హైవే మీదనే ఉండిపోయాయి. ఎండలు విపరీతంగా ఉండటంతో గుడ్లు పాడైపోతాయని ట్రేడర్లు ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏపీ నుంచి ఆ గుడ్లు ఒరిస్సాకు ఎగుమతి కావడం లేదు. ఒరిస్సాలోని జాతీయ రహదారి మీదుగా బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిస్సా, బీహర్ ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒరిస్సా కోళ్ల రైతులు, ట్రేడర్లు తమ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నారు. కోళ్ల మేతల ధరలు పెరుగుతున్నా.. గుడ్డు ధర పెరగడం లేదని వారు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు ఏపీ రైతుల గుడ్లకు అసలు సంబంధమే లేదు. అయినప్పటికీ ఒరిస్సా జాతీయ రహదారుల మీదుగా గుడ్ల లోడ్లు వెళ్లకుండా చేస్తున్నారు.
చంద్రబాబు బృందం పది తప్పులు చేశారు - న్యాయసలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్న వాసిరెడ్డి పద్మ !
ఒరిస్సా రైతుల ఆందోళనల వల్ల.. తమకు రూ. 36 కోట్ల నష్టం వస్తుందని ఏ్పీ రైతులు, ట్రేడర్లు ఆందోళన చెందుతున్నారు. గుడ్ల ఎగుమతులును అడ్డుకోవడం పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎ.పి ఎగ్ ట్రేడర్స్ కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీ అధికారులు ఇంకా స్పందించలేదు. ఒరిస్సా ప్రభుత్వంతో సంప్రదించి. లారీలను సేఫ్‌గా ఒరిస్సా దాటించాలని కొంత మందికోరుతున్నారు. అది జాతీయ రహదారి కావడంతో అడ్డుకోవడం నేరమని.. అంటున్నారు. ఒరిస్సా రైతుల గుడ్లకు ధర రాకపోతే.. ఏపీ పౌల్ట్రీరైతులు ఏం చేస్తారని తక్షణం లారీలను విడిపించాలని కోరుతున్నారు. ఈ సమస్యపై ఒరిస్సా ప్రభుత్వం కూడా ఇంత వరకూ దృష్టి సారించలేదు.